పవన్ కళ్యాణ్ అమరావతి దగ్గరలోని కాజ గ్రామం సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో భారీ ఇంటికి శంఖుస్థాపన చేసిన నేపధ్యంలో పవన్ ను టార్గెట్ చేస్తూ విపరీతమైన మాటల దాడి కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో పవన్ అవినీతిపరుడు అంటూ వస్తున్న విమర్సల పై పవన్ ను ఆదుకునేందుకు స్వయంగా ‘జనసేన’ వర్గాలు రంగంలోకి దిగాయి.
PAVAN KALYAN LATEST PUBLIC MEETING AT GUNTUR PHOTOS కోసం చిత్ర ఫలితం
‘జనసేన’ అధికారిక ట్విట్టర్ పేజ్‌లో ఆ స్థలం ఎప్పుడు కొన్నది ? ఎంతకు కొన్నది ? ఎవరి వద్ద కొన్నది వంటి పూర్తి వివరాలతో డాక్యుమెంట్స్‌ను ఆధారాలుగా చూపిస్తూ ట్వీట్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కొన్న స్థలానికి వెల కట్టింది ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ అని ఎకరం భూమికి 20 లక్షలు ప్రభుత్వం వెల కట్టిందని, దాన్ని చెల్లించి అధికారికంగా రిజిస్ట్రేషన్ ఫీజులన్నీ చెల్లించే అక్కడ ఇళ్లు కడుతున్నట్టు అన్ని ఆధారాలతో ట్వీట్‌ పెట్టి పవన్ పై వస్తున్న విమర్శలకు ధీటైన సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించింది.
సంబంధిత చిత్రం
అయితే అమరావతి చుట్టు పక్కల ప్రాంతంలో భూముల విలువ కోట్ల రూపాయలలో ఉన్న నేపధ్యంలో ఈ భూమి విలువ గురించి ‘జనసేన’ ప్రతినిధులు అధికారికంగా చూపించినా ఈ భూమి విలువ పై అనేక సమాధానం లేని ప్రశ్నలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది చాలదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అంటే పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ టైపు అని తెలుగుదేశ వర్గాలు పవన్ ను  టార్గెట్ చేస్తూ సరికొత్త విమర్శలు చేస్తున్నారు. 
PAVAN KALYAN LATEST PUBLIC MEETING AT GUNTUR PHOTOS కోసం చిత్ర ఫలితం
పవన్ నిన్న ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ హోదా కానీ లేదంటే స్పెషల్ ప్యాకేజ్ కానీ పేరు ఏదైనా డబ్బులు అందే ఏదోఒక పని జరిగితే సమస్యలు తీరతాయి అని పవన్ చేసిన కామెంట్ తో పవన్ యూటర్న్ తీసుకున్నాడా అంటూ విపరీతంగా విమర్శల దాడి మొదలైంది. అయితే ఈ విషయాలను ఆ ఇంటర్వ్యూ నిర్వహించిన జాతీయ మీడియా ప్రతినిధి తప్పుగా అర్ధం చేసుకున్నాడు అంటూ ‘జనసేన’ వర్గాలు ఖండిస్తూ ఉన్నా పవన్ ఇమేజ్ కి మాత్రం గత కొన్ని రోజులుగా విపరీతమైన డ్యామేజ్ జరుగుతోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: