సినిమాలో ఒక్క చాన్స్ వచ్చిందంటే..సెలబ్రెటీలు అవుతారని అందరూ భావిస్తారు..కానీ ఆ సినిమా స్టార్ల వెనుక కూడా ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉంటాయని చాలా మందికి తెలియదు.  స్టార్ హీరోలుగా వెలిగిన వారు చివరి దశలో అత్యంత దీన స్థితిలో గడిపిన వారు ఉన్నారు.  కోట్లు సంపాదించిన వారు..వారి అంతిమ దశలో మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి చేరుకున్న నటులు ఉన్నారు.  కొంత మంది స్టార్లు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూసేవారు కూడా ఉన్నారు.  అలాంటి వారు మంచి పొజీషన్లో ఉన్నారు.  తాజాగా అలనాటి బాలీవుడ్ నటి, సల్మాన్ ఖాన్ హీరోయిన్ పూజా దడ్వాల్ తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో ఉన్నారు.
Image result for pooja dadwal
కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని దీన స్థితిలో ఉన్నట్లు తెలిపారు. 1990ల్లో వచ్చిన ‘వీర్ ఘటి’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా పూజ నటించారు. సాయం కోసం సల్మాన్ ఖాన్ ని కలిసేందుకు ప్రయత్నించాను కానీ, కుదరలేదని తెలిపారు. ‘నాకు క్షయ ఉందని 6 నెలల కిందట తెలిసింది. ముంబైలోని సెవ్రీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పూజాను టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన నవభారత్ టైమ్స్ టీమ్ పలుకరించినప్పుడు తన దుర్భర స్థితిని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
Image result for pooja dadwal
తన దీన పరిస్థితి గురించి ఎవరైనా సల్మాన్ ఖాన్ కి తెలిసేలా చేయాలని మీడియా వారిని కోరుకుంటుంది.  హిందుస్థాన్, దబ్దడా, ఇంతెక్వామ్, సింధూర్ కీ సౌగంధ్ సినిమాల్లోనూ పూజ నటించారు. ‘గతంలో కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో  నడిపిన సమయంలో తన ఆర్థిక పరిస్థితి చాలా బాగుండేదని..కొన్ని ఆర్థిక కారణాల వల్ల నష్టపోయానని అన్నారు.
Image result for pooja dadwal
ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. టీ కొనుక్కోవడానికి కూడా వేరే వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనారోగ్యం గురించి తెలిసి భర్త, బంధువులు వదిలేసి వెళ్లిపోయారు’ అని చెబుతూ పూజ కన్నీటిపర్యంతమయ్యారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: