బుల్లితెర మీద అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తున్న యాంకర్ అనసూయ ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంటుంది. క్షణం తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి అడపాదడపా సినిమాలు చేస్తున్నా సరే అమ్మడికి అంత క్రేజ్ రావట్లేదు. అయితే ఇలా అయితే కుదరట్లేదని మళ్లీ యాంకరింగ్ లోనే హవా కొనసాగించగా ఇప్పుడు మళ్లీ రాం చరణ్ రంగస్థలంలో అమ్మడు నటించింది.


సినిమాలో ఆమె రంగమ్మత్తగా అత్త పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో అనసూయ ఎలా ఉంది అనేది ఫస్ట్ లుక్ పోస్టర్ తో చూపించారు. హాట్ యాంకర్ గా అందాలను గుమ్మరించే అనసూయ ఇలా అత్త పాత్రలో చూడటం కాస్త కష్టమే కాని చిలిపి అత్తగా అనసూయ సినిమాలో కనిపించనుందని టాక్.


సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుందట. అంతేకాదు సినిమా అంతా సీరియస్ మోడ్ లో సాగుతుంటే చిట్టిబాబుతో రంగమ్మత్త చిలిపి మాటలతో ఎంటర్టైన్ చేస్తుందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ రంగస్థలం సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 


దేవి శ్రీ ప్రసాద్ ఆడియో అందించిన ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సినిమాలో పూజా హెగ్దె ఐటెం సాంగ్ కూడా ఉందని తెలుస్తుంది. మొత్తానికి సమంత నటన, పూజా ఐటెం సాంగ్, అనసూయ మేనత్త చిలిపి తనం అంతా సినిమాకు స్పెషల్ క్రేజ్ తెస్తాయని అంటున్నారు. ఈ నెల 30న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: