తెలుగు ఇండస్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ తర్వాత చిన్నచిన్న పాత్రల్లో నటించాడు.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇడియట్’ చిత్రంతో హీరోగా మారిన రవితేజ వరుస విజయాలతో దూసుకు పోయాడు.  మాస్ మహరాజుగా ఒక్క వెలుగు వెలిగిపోయిన రవితేజ ‘పవర్’ చిత్రం తర్వాత ఒక్కసారే డీలా పడ్డాడు.  వరుసగా అపజయాలతో సతమతమయ్యాడు.  దాంతో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మరో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. 
Image result for hero raviteja
ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు చిత్రం మళ్లీ నిరాశ పరిచింది.  అయితే ఇండస్ట్రీలో రవితేజకు మంచి మార్కెట్ ఉంది. రవితేజ సినిమాలు అంటే మినిమం గ్యారంటీ ఉంటుందని నిర్మాతలు అతనితో సినిమాలు తీయడానికి రెడీగా ఉంటారు. రవితేజ సినిమాలకు థియేట్రికల్‌ రెవెన్యూ పాతిక కోట్లు మించి రావడం లేదు. రవితేజ తన మార్కెట్ ప్రకారం సీనియర్ నటుడు కావడంతో పదికోట్ల రెమ్యూనరేషన్ అడుగుతున్నాడట.
Image result for hero raviteja
దాంతో నిర్మాతలు ఇది ఎలా కుదురుతుందని అనడంతో..మనోడు పర్మనెంట్ సొల్యూషన్ కనుక్కున్నాడు.  తనతో సినిమాలు తీసే నిర్మాతలకు తనకు పారితోషికం ఇవ్వవద్దని చెబుతున్నాడట. దానికి బదులుగా శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ఇచ్చేయమని అడుగుతున్నాడట. రవితేజకు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. 
Related image
ఎంత లేదన్నా..రవితేజ సినిమాలకి హిందీ డబ్బింగ్‌ రైట్సే.. శాటిలైట్‌ హక్కులు మొత్తంగా పధ్నాలుగు, పదిహేను కోట్లు ఈజీగా పలుకుతాయి. మరి రవితేజ కోరుకున్నట్టుగానే నిర్మాతలు ఈ పదిహేను కోట్లని వదులుకోవడానికి సై అంటారా లేదా నో అంటారా చూడాలి. రవితేజ అయితే మాత్రం పది కోట్లు హార్డ్‌ క్యాష్‌ లేదా ఆ రైట్స్‌ ఇమ్మని ఖచ్చితంగా చెబుతున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: