‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తరువాత ఇప్పడు అందరి దృష్టి వచ్చేనెలలో జరగబోతున్న ‘భరత్ అనే నేను’ ఆడియో ఫంక్షన్ పై ఉంది. పొలిటికల్ బ్యాక్  డ్రాప్ కథాంశంతో ఈమూవీ ఈ మూవీ రూపొందుతున్న నేపధ్యంలో ఈమూవీ ఆడియో రిలీజ్ కోసం ఏకంగా అసెంబ్లీ సెట్ వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో నిర్వహించబోయే ఈ ఆడియో ఫంక్షన్ ను హైదరాబాద్ లో నిర్వహించడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది.
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికోసం ఏకంగా అసెంబ్లీ సెట్ వేయాలని నిర్ణయించినట్లు టాక్. ఈ సెట్ ఎలా ఉండాలి స్టేజ్ కింద ఆహూతుల కోసం ఎలాంటి సెట్ వేయాలనే అంశం పై ఇప్పటికే స్కెచ్ లు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ ప్రచారం కోసం కొరటాల శివ మొదటి నుంచి చాల డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఈమూవీ ప్రమోషన్ ను కొనసాగిస్తున్నాడు. 
BHARATH ANE NENU MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
సినిమాలకు సంబంధించి అందరూ విడుదల చేసే ఫస్ట్ లుక్ స్థానంలో ఫస్ట్ ఓత్ అంటూ మహేష్ ప్రమాణస్వీకారం చేస్తున్న ఆడియోను విడుదల చేశారు. రీసెంట్ గా విజన్ ఆఫ్ భరత్ అంటూ టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ఆడియో ఫంక్షన్ కోసం ఏకంగా అసెంబ్లీ సెట్ వేస్తున్న నేపధ్యంలో ఈమూవీ ఆడియో ఫంక్షన్ లో ఇంకా చాల ట్విస్టులు ఉండే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
సంబంధిత చిత్రం
ఇది ఇలా ఉండగా ఉగాదినాడు విడుదల చేసిన మహేష్ పంచెకట్టు స్టిల్ కు మంచి స్పందన వచ్చినా ఈ లుక్ పై కొందరు సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ‘డ్రస్సు మారింది సరే ఎక్స్ ప్రెషన్ కూడా మార్చవయ్యా బాబూ’ అంటూ కొందరు మహేష్ వ్యతిరేకులు ప్రిన్స్ ను ఆట పట్టిస్తూ సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారాయి. ఈమూవీ విజయం మహేష్ కు అత్యంత కీలకమైన నేపధ్యంలో తన లుక్ పై వస్తున్న ఈ నెగిటివ్ కామెంట్స్ కూడ మహేష్ దృష్టికి వెళ్ళే ఆస్కారం ఉంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: