కొత్తందాలను వెతుక్కోవడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. తెలుగు బ్యూటీలను కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి బ్యూటీస్ ను దిగుమతి చేసుకోవడంలో టాలీవుడ్ దే హవా. ఇప్పటికే ఏజ్ బార్ బ్యూటీస్ తో తట్టుకోలేకపోతున్న టాలీవుడ్ లో కొత్త అందాలు భారీగానే వచ్చేశాయి. తాజాగా .. కర్నాటక నుంచి వచ్చిన కుర్రది వరుస ఛాన్స్ లతో అదరగొడుతోంది.

Related image

టాలీవుడ్ లో ఇప్పటికే అనుపమ, నివేదాలు స్పీడ్ పెంచేశారు. వారికి పోటీగా మారింది రష్మిక మందన. ‘చలో’ ఇచ్చిన బూస్ట్ తో ఇప్పుడు 3 ఆఫర్స్ పట్టేసిందీ ముద్దుగుమ్మ. అంటే వచ్చే సీజన్ మొత్తం తనదే అర్థమైపోతోందిగా..! కన్నడలో కిరాక్ పార్టీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయినా బ్యూటి రష్మిక మందన. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వెంటనే తెలుగులో ఈ బ్యూటీకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ దక్కింది. రీసెంట్ గా వచ్చిన చలో మూవీలో నాగశౌర్యతో జోడీ కట్టి తెలుగులోనూ మంచి హిట్ ఎకౌంట్ లో వేసుకుంది.

Image result for rashmika mandanna

చలో సక్సెస్ తో ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రష్మిక ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది. నాగార్జున, నాని హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో హీరోయిన్ గా రష్మికను ఎంపిక చేసిందట ఆ సినిమా యూనిట్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా అమలాపాల్ నటిస్తుండగా నాని సరసన రష్మికను పైనల్ చేసింది ఆ ఫిల్మ్ టీం.

Image result for rashmika mandanna

ఉగాది రోజు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీడియం రేంజ్ బడ్జెట్ లో వీలైనన్ని తక్కువ కాల్షీట్లతో ఈ మల్టీస్టారర్ ను పూర్తిచేయాలనే ఆలోచనలో ఉంది ఆ యూనిట్. ఇక ఈ సినిమాలో నాని సరసన రష్మిక ఛాన్స్ కొట్టేయడంతో ఈ బ్యూటీ సీన్ మారే ఛాన్స్ ఉందంటున్నారు. వచ్చే సీజన్ లో మరిన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తోంది. మరి ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: