సినిమాల్లో చాన్స్ దొరికితే తమ జీవితం మారుతుందని ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు హైదరాబాద్ లోని స్టూడియోల చుట్టూ తిరుగతుంటారు.  ముఖ్యంగా హైదరాబాద్ లోశ్రీ కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్టులకు అడ్డా అని అందరికీ తెలిసిన విషయమే.  ఇక్కడ ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులు నివాసం ఉంటారు..ఎంతో మంది యువ కళాకారులు సినిమా చాన్సుల కోసం ఎదురు చూస్తుంటారు. 

తాజాగా ఓ వర్థమాన నటి కి కృష్టానగర్ లోని జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసే ఓ వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి. అంతే కాదు తనను ప్రేమించకున్నా..పెళ్లి చేసుకోకపోయినా..దారుణంగా చంపేస్తానని బెదిరించపులు వచ్చాయి. మొదట్లో పెద్దగా పట్టించుకోక పోయినా..ఆమె పై లేని పోయిన రూమర్లు సృష్టిస్తూ..తనను పెళ్లి చేసుకోవాలని బలవంత పెడుతూ ఫోన్లు రావడం మొదలయ్యాయి.

మర్యాదగా పెళ్లి చేసుకోవాలని..లేదంటే ముఖంపై యాసిడ్ పోస్తానంటూ బెదిరిస్తున్నాడు కో ఆర్డినేటర్ రాజు. గత రెండు నెలలుగా వెంటనడుతున్న రాజు వేధిపులను తట్టుకోలేక ఆమె బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అంతేకాదు తాను నటిస్తున్న సినిమా సెట్‌కి కూడా వచ్చి వేధించడమే కాకుండా, దర్శకుడికి నీకు ఏంటి సంబంధం అంటూ అసభ్యకరంగా మాట్లాడుతున్నా డని అతడినుంచి తనకు రక్షణ కల్పించమని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: