ఈ వారం విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ ‘ఎం.ఎల్.ఎ’ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఊహించినట్లుగానే జూనియర్ రాకుండానే జరిగిన ఈ ఫంక్షన్ లో పోసాని కృష్ణ మురళి చేసిన ఉపన్యాసం హైలెట్ గా మారింది. ఏ విషయం పై అయినా ఆవేశంగా మాట్లాడే పోసాని కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ మధ్యలో టంగ్ స్లిప్ అయి కళ్యాణ్ రామ్ అనబోయి రెండు సార్లు పవన్ కళ్యాణ్ అంటూ సంభోదించడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. 
పటాస్ తర్వాత ఈ సినిమానే
గత కొన్ని రోజులుగా మీడియాలో ఎక్కడ చూసినా పవన్ నామస్మరణ కనిపిస్తున్న నేపధ్యంలో పోసాని కూడ ఆవార్తలకు మైండ్ బ్లాంక్ అయి కళ్యాణ్ రామ్ ను పవన్ కళ్యాణ్ గా మార్చేసాడా అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది జోక్ చేసుకున్నారు. ఇదే ఫంక్షన్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ ఈమూవీ దర్శకుడు ఉపేంద్ర తనకు పెట్టిన టార్చర్ ను బయట పెట్టాడు.
డైరెక్టర్ టార్చర్
తన లుక్ విషయంలో అదేవిధంగా డైలాగ్స్ పలికే టైమింగ్ విషయంలో దర్శకుడు ఉపేంద్ర పెట్టిన టార్చర్ ను కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ఈసినిమాలో తను పడ్డ టార్చర్ వల్ల తాను 5 కేజీలు బరువు తగ్గిన విషయాన్ని జోక్ గా బయట పెట్టాడు. అంతేకాదు ఈమూవీ తన ‘పటాస్’ మూవీలా అందరికీ నచ్చుతుంది అంటూ ఈమూవీ పై తనకు ఉన్న అంచనాలు బయట పెట్టాడు కళ్యాణ్ రామ్.
మార్చి 23న విడుదల
కళ్యాణ్ రామ్ సినిమాలకు ఇప్పటి వరకు చెప్పుకోతగ్గ ఓపెనింగ్స్ రాకపోయినా ఈసినిమాకు ఎవరూ ఊహించని విధంగా 23 కోట్ల బిజినెస్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈమధ్య కాజల్ నటించిన సినిమాలు అన్నీ హిట్ అవుతున్న సెంటిమెంట్ రీత్యా అదే అదృష్టం కళ్యాణ్ రామ్ కు కూడ రిపీట్ అవుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: