జూనియర్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీ పై భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో ఈమూవీ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు ఇండస్ట్రీ వర్గాలను షేక్ చేస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ షూటింగ్ వచ్చేనెల 12 నుంచి ప్రారంభం అయి నెలాఖరు వరకు షూటింగ్ జరుగుతుందని తెలుస్తోంది. 
JUNIOR NTR ALONG WITH TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఆతరువాత కేవలం నాలుగురోజుల గ్యాప్ మాత్రమే ఇచ్చి ఈమూవీకి సంబంధించిన రెండవ షెడ్యూల్ ను కూడ ప్రారంభిస్తాడట త్రివిక్రమ్. తాను తీసే సినిమాలను చాల నెమ్మదిగా తీసే త్రివిక్రమ్ ఇలా పరుగులు తీయడానికి జూనియర్ రాజమౌళి సినిమాను దృష్టిలో పెట్టుకుని త్రివిక్రమ్ ఇచ్చిన టైం టార్గెట్ అని అంటున్నారు. 
TRIVIKRAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ సినిమాను దసరా లోపు పూర్తి చేసి దసరా రేసులో విడుదల చేసుకోమని జూనియర్ ఈమూవీ నిర్మాతలకు అదేవిధంగా త్రివిక్రమ్ కు సలహాలు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమూవీ బడ్జెట్ 100 కోట్ల వరకు అవుతున్న నేపధ్యంలో సంక్రాంతికి అయితే ఈమూవీ బిజినెస్ బాగా జరుగుతుంది అన్న అభిప్రాయాన్ని త్రివిక్రమ్ తో పాటు ఈమూవీ నిర్మాతలు కూడ జూనియర్ వద్ద వ్యక్త పరుస్తున్నట్లు తెలుస్తోంది. 
JUNIOR NTR LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఈ సూచన జూనియర్ కు ఏమాత్రం నచ్చలేదని తెలుస్తోంది. సంక్రాంతికి ఎన్టీఆర్ బయోపిక్ విడుదల అవుతున్న నేపధ్యంలో డేట్ లు అడ్జస్ట్ చేసుకోవాలిసి వస్తుందని అందువల్ల తప్పని సరి అయితే తప్ప సంక్రాంతికి వెళ్లకుండా చూడమని జూనియర్ త్రివిక్రమ్ కు సూచన ప్రాయంగా సలహాలు ఇచ్చినట్లు టాక్. దీనితో బాలయ్య సినిమాతో ముఖ్యంగా తన తాత ఎన్టీఆర్ బయోపిక్ తో తన సినిమాను పోటీగా తీసుకు రావడం జూనియర్ కు ఇష్టం లేదు కాబోలు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: