ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి లో నటించాడో అప్పటి నుంచి ఒక్క సారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు అని చెప్పొచ్చు. ఇండియా లో కనీ వినీ ఎరుగని కలెక్షన్ లా సునామి సృష్టించింది. అయితే ప్రస్తుతం ఇండియాలో అత్యథిక వసూళ్లు సాధించిన చిత్రంగా బాహుబలి-2 నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమా మాత్రం ఇది కాదు.
Image result for prabhas
అమీర్ నటించిన దంగల్ సినిమా ఆ ఘనత సాధించింది. దీనికి కారణం చైనా మార్కెట్. దంగల్ సినిమా ఇండియాలోనే కాదు, చైనాలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దీనికి కారణం అక్కడున్న భారతీయులు మాత్రమే కాకుండా, చైనా రూరల్ జనాలు దంగల్ ను  ఎగబడి చూశారు. అలా ప్రపంచవ్యాప్తంగా అత్యథిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా దంగల్ నిలిచింది. బాహుబలి-2 మాత్రం ఈ ఘనత అందుకోలేకపోయింది.
Image result for prabhas
ఎందుకంటే భారీ మార్కెట్ కలిగిన చైనాలో ఇదింకా విడుదల కాలేదు. ఎట్టకేలకు ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ ఫార్మాలిటీ పూర్తి  బాహుబలి-2 సినిమా త్వరలోనే చైనాలో విడుదలకానుంది. పార్ట్-1 ను రిలీజ్ చేసిన ఈ-స్టార్స్ మీడియా సంస్థే పార్ట్-2ను కూడా రిలీజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బాహుబలి-2సినిమా దంగల్ ను అధిగమిస్తుందా అనేది ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. అయితే బాహుబలి మేకర్స్ కు ఇక్కడ చెప్పుకునే స్థాయిలో సానుకూల సంకేతాలు లేవు. ఎందుకంటే బాహుబలి పార్ట్-1చైనాలో ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు చైనాలో వచ్చిన డబ్బులు అక్కడికక్కడే సరిపోయాయనే విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో బాహుబలి-2కు చైనీయులు బ్రహ్మరథం పడతారా.. లేక తిప్పికొడతారా అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: