ఒకప్పుడు మీడియా, పత్రికలు అంటే ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధి లాగా పని చేసే వారు. ప్రభుత్వం లో ఏదైనా తప్పు జరిగితే తప్పును ఎత్తి చూపించి, ప్రజలను మేల్కొనేలా చేసే వారు. అయితే ఇప్పుడు  పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా కొన్ని పత్రికలైతే అధికార టీడిపి పార్టీ కి వెన్ను దన్ను గా ఉంటున్నాయి. పత్రిక విలువలు, సిగ్గు సెరం వదిలేసి చెట్టంతా రాసి ప్రజలకు నిజాలు తెలియ కుండా తప్పు దోవ పట్టిస్తున్నాయి.
Image result for abn andhra jyothi
మూడు రోజులుగా తెలుగుదేశం పార్టీ అనుకూల దినపత్రికలు చూస్తే ఈ విషయం అర్థం అయిపోతుంది. చంద్రబాబు నేరుగా ఒక్కమాట మాట్లాడడంలేదు. కేవలం ఆయన పార్టీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఏమన్నారో ప్రజలకు తెలియదు. కానీ మీడియా మాత్రం దాని చిత్తానికి అది రాస్తోంది. ఓ మీడియా కేవలం కేంద్రం తప్పిదాల గురించి మాత్రం ప్రస్తావిస్తుంటే, మరో  మీడియా భలే చిత్రంగా రాస్తోంది.
Image result for telugu media
వాట్సప్ ల్లో, ఫేస్ బుక్ ల్లో చలామణీ అయ్యే అడ్డగోలు ఫొటోలు, వార్తలు లీడ్ గా తీసుకుంటూ, అవి చంద్రబాబు అన్నారో లేరో తెలియని విధంగా లీడ్ రాస్తూ, ఆపైన చంద్రబాబు  టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాట్లాలు లింక్ చేస్తూ, జనాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం దిగ్విజయంగా జరుగుతోంది. మొన్నటికి మొన్నటి ఎన్నికల్లో భాజపాతో అంటకాగిన వైనాన్ని పక్కనపెట్టి,  ఇప్పుడు మైనారిటీలతో ఫొటోలు దిగి హడావుడి చేస్తున్నారు. మరి గడచిన నాలుగేళ్లు ఈ మైనారిటీలను పక్కన పెట్టిన వైనాన్ని ఎందుకు గుర్తు చేసుకోవడం లేదో? అర్థంకాదు. మూడున్నరేళ్లు భాజపాతోనే వుంటూ, భాజపా సిద్ధాంతాలే వల్లె వేసారు. ఇప్పుడు ఆ పాపాలకు వైకాపాను బలి చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రమైన వ్యవహారానికి మీడియా వత్తాసు పలకడం దారుణం.


మరింత సమాచారం తెలుసుకోండి: