పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే టీడిపి మీద ఎదురు దాడి మొదల పెట్టాడో ఒక్క సారిగా అన్ని వైపులా నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎదురు దాడి జరుగుతుంది. టీడిపి అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ చాలా రాస్తుంది. అయితే ఇప్పుడు ఒక వార్త మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. కొన్ని రోజుల కిందట పవన్ ఇళ్లు, ఆఫీసులపై ఐటీదాడులు జరిగాయట.
Image result for pavan kalyan janasena
ఆ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలతో పాటు మరికొన్ని వీడియోలను కూడా అధికారులు పెన్ డ్రైవ్ లో తీసుకెళ్లారట. దాన్ని కేంద్రం చేజిక్కించుకుందట. ఆ పెన్ డ్రైవ్ ఆధారంగా పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఓ ఆట ఆడిస్తోందట. దీంతో చేసేదేం లేక కేంద్రం పెద్దలు చెబుతున్నట్టు పవన్ నడుచుకుంటున్నాడనేది ఈ పెన్ డ్రైవ్ కథ. ఇందులో భాగంగానే చంద్రబాబు, లోకేష్ పై పవన్ అవినీతి ఆరోపణలు చేస్తున్నారట.
Image result for pavan kalyan janasena
లేదంటే పవన్ కు అంత సీన్ లేదని, టీడీపీతోనే మరోసారి దోస్తీ కట్టడానికి ఆయన మొగ్గుచూపారని అంటున్నారు. చంద్రబాబు సర్కార్ అవినీతిపై ఏకంగా విచారణ జరిపించాలనే డిమాండ్ కూడా పెన్ డ్రైవ్ మూలంగానే తెరపైకొచ్చిందని అంటున్నారు.  ఈమధ్య ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. మీ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన మాట నిజమేనా అని ప్రశ్నించింది. దీనికి పవన్ ముక్తసరిగా సమాధానమిచ్చారు. తనకు ఎన్ని ఆస్తులున్నాయో  అందరికీ తెలుసన్నారు. అయినా తను ప్రిపేర్ అయి ఇంటర్వ్యూకు రాలేదని, మరోసారి ఈ అంశంపై స్పందిస్తానని తప్పించుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: