రాజమౌళి సినిమాలలో అవకాశాలు రావడం అదృష్టం అని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే హీరోలకు మాత్రం రాజమౌళి సినిమాలో అవకాసం టార్చర్ గా మారుతుంది. తన సినిమాలలో నటించే హీరోలకు రాజమౌళి పెట్టె పరీక్షలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మరి ఏ టాప్ దర్శకుడు పెట్టడు అన్నది వాస్తవం. ‘బాహుబలి’ తరువాత రాజమౌళి తీయబోయే సినిమాకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా రాకపోయినా ఈసినిమా పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
మొదట్లో ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా ఒక రొటీన్ సినిమాలా సింపుల్ గా ఈమూవీని తీయాలని రాజమౌళి భావించినా తన పై వచ్చిన ఒత్తిడితో ఈమూవీ బడ్జెట్ ఇప్పుడు 250 చేరిపోయింది అని వార్తలు వస్తున్నాయి. తెలుగు తమిళ హిందీ భాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈమూవీలో కూడ విపరీతమైన గ్రాఫిక్స్ ఉంటాయని సమాచారం. 
JUNIOR NTR ALONG WITH RAMCHARAN ATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
రాజమౌళి మార్క్ కు తగ్గట్టుగా ఏవిషయంలోను రాజీ పడకుండా నిర్మింపబడే ఈమూవీని 2020లో మాత్రమే విడుదల అయ్యేలా రాజమౌళి యాక్షన్ ప్లాన్ రచించినట్లు టాక్. ఈ ఏడాది సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభం అయ్యే ఈమూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కనీసం ఏడాది సమయం పడుతుందని ఇప్పటికే రాజమౌళి జూనియర్ చరణ్ లకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఆ తరువాత ఈమూవీకి సబంధించిన పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ గ్రాఫిక్ వర్క్స్ కోసం రాజమౌళి ఆరు నెలలు సమయాన్ని కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనినిబట్టి చూస్తుంటే ఈ మల్టీ స్టారర్ 2020 సమ్మర్ కు మాత్రమే విడుదలయ్యే అవకాసం ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో జూనియర్ చరణ్ లు సుమారు ఒక సంవత్సరం పైగా రాజమౌళి దగ్గర బందీలుగా మారడంఖాయం అన్న మాటలు హల్ చల్ చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: