అదేంటీ ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పటికే వెలగపూడిలో అసెంబ్లీ ఉందికదా..మరి విశాఖ తీరాన అసెంబ్లీ ఏంటా అని అనుమానాలు వస్తున్నాయి కదూ..అబ్బే ఇది నిజమైన అసెంబ్లీ కాదండీ..ఓ సినిమా ఆడియోకి సంబంధించిన సెట్టింగ్.  ఈ మద్య టాలీవుడ్ హీరోల సినిమాలు హైదరాబాద్ లో కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ తీరంలో ఫ్రీరిలీజ్ ఫంక్షన్లు అవుతున్నాయి. ఇప్పటికే పలు సినిమా ఫంక్షన్లు విశాఖ తీరాన జరిగిన సంగతి తెలిసిందే. రాంచరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న ‘రంగస్థలం’ చిత్రానికి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖ తీరంలో జరిగింది.
Image result for mahesh babu bharath ane nanu
ఆర్కే బీచ్ లో ‘రంగస్థలం’ ఆడియో వేదిక పల్లె వాతావరణంతో కూడిన సెట్‌ను డిజైన్ చేశారు. ‘రంగస్థలం’ సినిమాకు అనుగుణంగా డిజైన్ చేసిన ప్రీ రిలీజ్ వేడుక సెట్ అందరినీ ఆకట్టుకుంది. ‘రంగస్థలం’ 1980 నాటి పరిస్థితులతో కూడిన చిత్రం దానికి అద్దం పట్టేలా సెట్ రూపొందించారు.  ఇప్పుడు ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. 

‘శ్రీమంతుడు’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలతో పూర్తిగా ఢీలా పడ్డాడు మహేష్.  మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ చిత్రంలో నటిస్తున్నాడు మహేష్.  ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  అంతే కాదు ఈ సినిమా ప్రమోషన్ వర్క్ కూడా చాలా డిఫరెంట్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. 
Image result for mahesh babu bharath ane nanu
‘రంగస్థలం’ ప్రీ రిలీడ్ వేడుక జరిగిన విశాఖ ఆర్కే బీచ్‌లోనే అసెంబ్లీ సెట్ వేసి దానిపై ‘భరత్ అనే నేను’ ఆడియో విడుదల వేడుక జరపాలని చూస్తున్నారట. ‘భరత్ అనే నేను’ రాజకీయ నేపథ్యం ఉన్న చిత్రం కాబట్టి కచ్చితంగా అసెంబ్లీ సెట్ అయితేనే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. 


మరింత సమాచారం తెలుసుకోండి: