నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఈ నెల 29న మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ ముహుర్తం పెట్టుకున్న ఈ సినిమా ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి ఇక ఈ సినిమా మొదలు పెడుతున్నాడో లేదో బాలయ్య బాబు తన తర్వాత సినిమా ప్రయత్నాలను మొదలు పెట్టాడు.


100వ సినిమా శాతకర్ణి తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచేసిన బాలకృష్ణ పైసా వసూల్, జై సింహా తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చాడు. అయితే ఎన్.టి.ఆర్ సినిమా తర్వాత కన్నడ సినిమాను రీమేక్ చేయాలని చూస్తున్నాడట బాలయ్య బాబు. కన్నడలో మఫ్తి సినిమా సూపర్ హిట్ అయ్యింది.


ఆ సినిమాను తెలుగులో తీయాలని నిర్ణయించుకున్నారట బాలయ్య. కన్నడలో శివ రాజ్ కుమార్ హీరోగా చేసిన ఆ సినిమా అక్కడ రికార్డ్ కలక్షన్స్ సాధించింది. ఇక అదే సినిమా తెలుగులో బాలయ్య చేసినా అదే రేంజ్ రిజల్ట్ అందుకోవడం ఖాయం. ముఖ్యంగా బాలయ్య రీమేక్ చేయడం చాలా అరుదు అలా చేస్తే ఇక రికార్డుల హిస్టరీ రిపీట్ అయినట్టే అని అంటున్నారు.


ఇక ఈ సినిమా గురించి మిగతా డీటేల్స్ త్వరలో రావాల్సి ఉంది. తేజ డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ సినిమా వస్తుండగా ఆ సినిమా తర్వాత ఏమాత్రం లేటు చేయకుండా ఈ మఫ్తిని రీమేక్ చేయనున్నాడట. అండర్ కవర్ కాప్ గా బాలయ్య ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే చాలా సర్ ప్రైజింగ్ గా ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: