తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ‘రంగస్థలం’ చేస్తున్న రచ్చ మామూలుగా లేదు.  ఇప్పటికే..ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఈ చిత్రంలో  ‘రంగ రంగ రంగస్థలాన’ అంటూ సాగిన పాట ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. చంద్రబోస్ రాసిన అద్భుతమైన సాహిత్యానికి దేవీశ్రీ ఇచ్చిన మ్యూజిక్  మైండ్ బ్లోయింగ్ అంటున్నారు ప్రేక్షకులు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘రంగస్థలం’ 1985 గ్రామీణ వాతావరణం కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించిన ఫోటోలు కూడా రిలీజ్ చేస్తున్నారు.  ఇప్పుడు తాజాగా ఈ పాట మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.2 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియోను బుధవారం యూట్యూబ్‌లో ఉంచింది.

 తెలుగులో మంచి గుర్తింపు తెచ్చున్న డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. గోదావరి తీరాన ఈ పాటను చిత్రీకరించారు.  షూటింగ్ మధ్యలో రామ్‌చరణ్ చిన్నారులతో ముచ్చటించిన సన్నివేశాలను కూడా వీడియోలో పొందుపరిచారు.

హోటల్ గదిలో నుంచి అభిమానులకు అభివాదం చేయడం, చరణ్ కోసం షూటింగ్ స్పాట్ వద్ద అభిమానులు ఎగబడటం ఇలా చాలా సన్నివేశాలను రెండు నిమిషాల్లో చూపించేశారు.  మొత్తానికి ‘రంగస్థలం’ చిత్రంతపై రోజు రోజుకీ అభిమానులకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: