సెక్స్.. పాశ్చాత్యదేశాల్లో ఇదో సాధారణమైన విషయం. టీనేజర్స్ నుండి వృద్ధుల వరకు మొహమాటం లేకుండా మాట్లాడేస్తారు. అయితే భారత్లో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. సంప్రదాయాలు కలిగిన భారతదేశంలో శృంగారం అనేది నాలుగు గోడలమధ్యనే మాట్లాడుకుంటారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారుతోంది. విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ మీద అవగాహన కూడా కల్పిస్తున్నారు.


ఇదిలా ఉంటే బాలీవుడ్ తారలు సెక్స్ మీద నిర్మొహమాటంగా మాట్లాడేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య చెప్పిన మాటలు ఆయన్నే ఆశ్చర్యంలో ముంచెత్తాయి. బాలీవుడ్ కు సంబందించిన ఒక ఛానెల్లో నటి నేహా ధూపియా ఒక టాక్ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది. నిన్న జరిగిన కార్యక్రమానికి షాహిద్ దంపతులు హాజరయ్యారు. వీరికి ఆ షోలో ఊహించని ప్రశ్న ఎదురయింది. సెక్స్ లో మీకు ఇష్టమైన భంగిమ ఏంటని నేహా ధూపియా అడిగింది.


దానికి షాహిద్ కపూర్ ఈ ప్రశ్నను మార్చండి అని వేడుకొనగా ఆయన భార్య మాత్రం ఏమాత్రం తడబాటులేకుండా మా ఆయన శృంగారంలో ఆధిపత్యం చలాయిస్తాడు, నేనేం చేస్తుండాలో చెప్తుంటాడు అని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె ఇంకా చెప్తూ - పద్మావత్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు షాహిద్ ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికొచ్చేవాడు. సరిగ్గా నిద్రపోయేవాడు కూడా కాదు. నాకు, నా కూతురికి తగినంత సమయం కేటాయించట్లేదని నాకు కోపంగా ఉండేది. ఒక భార్యగా నేను ఆయనను అర్థం చేసుకొని షూటింగ్ స్పాట్ కు దగ్గరలో ఏదయినా హోటల్ రూంలో గడపమని చెప్పి ఆయనను అంతదూరం ఇంటికి రాకుండా చేసానని ఆమె తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: