ఏప్రిల్ 27న రెండు తెలుగు సినిమాలు అవి కూడా పెద్ద స్టార్ ఇద్దరు పొటీ పడాలని చూశారు. అందులో ఒకరు మహేష్ ఇంకొకరు బన్ని. మహేష్ భరత్ అనే నేను, బన్ని నా పేరు సూర్య ఈ రెండు మొదట ఏప్రిల్ 27న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కాని మధ్యలో కాలా వచ్చి ఇద్దరికి సంధి కుదిర్చింది. 


ప్రస్తుతం ఏప్రిల్ 20న మహేష్ భరత్ అనే నేను, మే 4న అల్లు అర్జున్ నా పేరు సూర్య రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టుగానే ఏప్రిల్ 27న కాలాకి వదిలారు. కాని చూస్తుంటే ఇప్పుడు కాలా సినిమా మరోసారి వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. తమిళనాడులో థియేటర్ బంద్ కారణంగా రజినికాంత్ కాలా వాయిదా పడుతుందట. 


అయితే సమ్మె విరమించలేదు కాని ముందు సెన్సార్ అయిన సినిమాలను క్యూలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఆ లెక్క ప్రకారం కాలా కంటే ముందు 20 సినిమాల దాకా ఉన్నాయి. వాటిని రిలీజ్ చేశాకే కాలా రావాల్సి ఉంటుంది. సో ఏప్రిల్ 27న తెలుగు, తమిళ భాషల్లో కాలా వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.


అయితే ఎలాగు మహేష్ ఏప్రిల్ 20న ఫిక్స్ అయ్యాడు కాబట్టి మళ్లీ బన్ని ముందు అనుకున్న ఏప్రిల్ 27న నా పేరు సూర్య సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాలా వాయిదా పడితే మహేష్ సినిమా ముందు వస్తుంది కాబట్టి ఆ సినిమాకు కచ్చితంగా మంచిదే కాని బన్ని సినిమాకు మాత్రం బ్యాండ్ పడుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: