పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సుమారు గా నాలుగేళ్ళు దాటి పోతుంది. అయితే తను కొన్ని సార్లు చాలా విషయాలను అవగాహన రాహిత్యం తో మాట్లాడతాడు అని అర్ధం అవుతుంటుంది. ఏమైనా మాట్లాడాలను కుంటే క్లారిటీ మైంటైన్ చేయడు అని అపనింద కూడా ఉంది. రాజకీయ నాయకుల మాదిరిగా తమ తప్పులను అవతలి వ్యక్తుల మీద కు రుద్దడం కూడా పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే బాగానే నేర్చుకున్నట్టున్నాడు.

Image result for pawan kalyan janasena

దేశానికి నవతరం రాజకీయాలు రుచిచూపించడానికి అంటూ అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ కూడా అదేమూసలో పడి కొట్టుకుపోతున్నారు. తెలుగుదేశం పార్టీ మంచి చెడుల దగ్గరినుంచి, ప్రతిపక్ష నాయకుడు జగన్మో హన్ రెడ్డి దగ్గరినుంచి, కేంద్రం పరంగా రాష్ట్రానికి ఏం జరగాల్సి ఉన్నది.. ఏం మోసం జరుగుతున్నది అనే విషయాల వరకు ఆయనకు చాలా వ్యవహారాల్లో పూర్తి అవగాహన ఉండదు. 
Image result for pawan kalyan janasena
తమ మాటలపై తమకే క్లారిటీలేని ప్రతివారికీ.. మీడియా వక్రీకరిస్తున్నదని నిందలు వేయడం ఒక్కటే ఆల్టర్నేటివ్ కింద కనిపిస్తున్నట్లుగా ఉంది. ఆ మేరకు ఆయన ట్వీట్ చేయడాన్ని మించిన మార్గంలేదని నమ్ముకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా కేంద్రం హోదాతో సహా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రతిదీ ఇచ్చి తీరాల్సిందేననే డిమాండ్ ను ఆయన ట్వీట్ ద్వారానే చెబుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఒక వ్యవస్థీకృత పార్టీలాగా బండి నడిపిస్తున్నారు గనుక.. 
ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు. మీడియాను ఫేస్ చేసి ప్రెస్ మీట్ లలో మాట్లాడితే.. ఎక్కడ ఏం నోరు జారుతామో.. ఎలాంటి కొత్త తకరారు వచ్చి పడుతుందో అని పవన్ భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: