తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎంతో మంది హృదయాలు గెల్చుకున్న రజినీకాంత్ ఏ చిత్రం రిలీజ్ అయినా ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.  హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా ఆయన నటించిన చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది.  ఆ మద్య యంగ్ డైరెక్టర్ పా రంజీత్ దర్శకత్వంలో ‘కబాలి’ చిత్రం మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్ల పరంగా డబ్బు వసూళ్లు చేసినా..హిట్ టాక్ మాత్రం రాలేదు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత, క్రేజీ డైరెక్టర్ పా రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ కాలా. 
Image result for rajini kanth kala movie
మురికివాడల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీ కరికాలన్ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషిస్తున్నాడు.  ఈ మద్య రిలీజ్ అయిన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీ అయింది. ఏప్రిల్ 27న మూవీని రిలీజ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించారు మేకర్స్. 
Related image
కొంత కాలంగా ఈ చిత్రంపై రక రకాల పుకార్లు వస్తున్నాయి. మొదట సెన్సార్ పూర్తి చేసుకున్న సినిమాలని ముందుగా విడుదల చేయాలని టీఎఫ్ పీసీ భావించిన నేపథ్యంలో కాలా రిలీజ్ డేట్ కాస్త ముందుకి వెళ్లిందని తమిళ మీడియా చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన లైకా సంస్థ కాలా రిలీజ్ డేట్ విషయంలో లైకా సంస్థ ఎవరితో ఎలాంటి చర్చలు జరపలేదు.
Image result for kaala movie photos
కాలా రిలీజ్ డేట్ విషయంలో వస్తున్న వార్తలకి, మాకు ఎలాంటి సంబంధం లేదని లైకా ప్రొడక్షన్ సంస్థ తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దాంతో ‘కాలా’ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఏప్రిల్ 27న గ్రాండ్ గా విడుదల కానున్నట్లు క్లారిటీ వచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: