ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు, ఫోటోలు చాలా మందిని ఒక్కసారే సెలబ్రెటీలుగా మారుస్తున్నాయి.  ప్రియా వారియర్....మెన్నటి వరకు ఈ అమ్మాయి గురించి ఎక్కువ మందికి తెలియదు. కానీ ఒకేఒక్క వీడియోతో ఈ బ్యూటీని పెద్ద సెలబ్రిటీని చేసేసింది. దేశ వ్యాప్తంగా ప్రియ ప్రకాశ్ గురించి చర్చించుకునేలా చేసింది.
Image result for ప్రియా వారియర్‌
కేవలం తన కళ్లతోనే అద్భుతమైన భావాలు పలికించి యవతను తన మాయలో పడేలా చేసుకుంది. ఇంటర్నెట్లో సంచలనంగా మారిన ప్రియా వారియర్ తాజాగా సన్నీ లియోన్‌ను సైతం వెనక్కి నెట్టేసింది.   సోషల్ మీడియాలో చిన్న పిల్లల నుండి పండు ముసలి వరకూ బాగా ప్రభావమైన వీడియో ఏదైనా ఉందంటే అది ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియోనే. 'ఓరు అడార్ లవ్' సినిమాలోని కన్నుకొట్టిన వీడియో యువత గుండెల్ని కొల్లగొట్టేసింది. సినిమాలో తన ప్రియుడిని చూస్తూ కన్నుకొట్టడంతో పాటు చేతి తుపాకిని ఎక్కుపెట్టిన తీరు కుర్ర హృదయాలకు కొల్లగొట్టేసింది.
Image result for ప్రియా వారియర్‌
దీంతో ఈ అమ్మడును ఫాలో అవుతూ.. డబ్ స్మాష్ చేసే వాళ్ళ సంఖ్యా కూడా బాగా పెరిగింది. ప్రియా వారియర్ లానే చూపులతో తూటాలు పేల్చేందుకు కోట్లాది మంది యువతులు ప్రియను అనుకరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ అమ్మడికి వచ్చిన క్రేజ్ తో దర్శక, నిర్మాతలు కూడా తమ సినిమాల్లో నటింప చేయాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  ఇటీవల ప్రియా వారియర్ బాలీవుడ్ లో బంపర్ ఆఫర్ వచ్చిందని వార్తలు హల్ చల్ చేశాయి. 
Image result for ranveer singh samba
కానీ నిన్నటితో ఆ ఆశలు ఆవిరైపోయాయి..టెంపర్ రిమేక్ లో రణవీర్ సరసన బాలీవుడ్ హీరో సయిఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ నటిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.  ఇదిలా ఉంటే..తమిళ హీరో సూర్య సరసన మరో చాన్స్ కొట్టేసిందని వార్తలు గుప్పుమన్నాయి.  తాజాగా ఈ చాన్స్ కూడా మిస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వి ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించబోతున్నాడు. ఈ చిత్రానికి ప్రియా వారియర్ ని హీరోయిన్ గా తీసుకోబుతున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై దర్శకుడు కెవి ఆనంద్ క్లారిటీ ఇచ్చారు.
Image result for surya
తాము ఇంతవరకు ఏ హీరోయిన్ ని సంప్రదించడం జరగలేదని ఆయన అన్నారు. ఈ సినిమాకి స్టార్ హీరోయిన్ నే తీసుకునే ఆలోచనలో ఉన్నామని అన్నారు.  ప్రియా ఇంకా 18 ఏళ్ళ టీనేజ్ పిల్లగానే కనిపిస్తోందని.. సూర్య, రణవీర్ సింగ్ సరసన నటించేంత వయసు ఆమెకు లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: