‘రంగస్థలం’ విడుదలకు ఇక వారంరోజులే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈమూవీ పై విపరీతంగా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈమూవీ అంచనాలు మరింత పెంచుతూ ‘రంగస్థలం’  ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా జోరుగా సాగుతున్నాయి.  ఈసినిమా రిజల్ట్ గురించి అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపధ్యంలో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ తన మామ రామ్ చరణ్   పోజును అనుసరిస్తూ  తీయించు కున్నఫోటో   ప్రస్తుతం  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 
ALLUARJUN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
బన్నీ ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ తన కొడుకు అయాన్ తన ఇంటిలో చేస్తున్న హడావిడిని బయటపెట్టాడు. అంతేకాదు అయాన్ చరణ్ మామకు పెద్ద అభిమాని అంటూ అల్లు అర్జున్ ఈ ఫొటోకు కామెంట్ పెట్టాడు. దీనితో రంగస్థలం ట్రైలర్ పై ఇప్పటివరకు బన్ని స్పందించలేదు అని అసహనంలో ఉన్న చరణ్ అభిమానులు అయాన్ చరణ్ ను అనుసరిస్తూ తీయించుకున్న ఫొటోకు లైకులు కొడుతూ ఒకరికి ఒకరు ఈ ఫోటోను షేర్ చేసుకుంటున్నారు. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా తీయపడ్డ ‘రంగస్థలం’ అలనాటి లోకల్ రాజకీయల  నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటికే చంద్రబోస్ సాహిత్యానికి దేవిశ్రీప్రసాద్ ట్యూన్ చేసిన ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వస్తున్న నేపధ్యంలోచరణ్ కు ఈ సినిమా ఒక మగధీరలా చరిత్ర సృష్టిస్తుంది అన్న ఆశలలో చరణ్ అభిమానులు ఉన్నారు. 
RAMCHARAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఏది ఎలా ఉన్న అయాన్ చరణ్ పై వ్యక్త పరుస్తున్న అభిమానం మెగా కుటుంబ సభ్యుల మధ్య చెదిరిపోని  సాన్నిహిత్యాన్ని సూచిస్తోంది. ఇప్పటి వరకు చరణ్ కెరియర్ లో 100 కోట్ల కలక్షన్స్ మైలురాయిని అందుకోని నేపధ్యంలో చరణ్ కలక్షన్స్ స్టామినాను నిరూపించే సినిమాగా ‘రంగస్థలం’ మారుతుంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: