తెలుగు ఇండస్ట్రీలో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ సత్తా చాటుతున్నారు.  మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండో చిత్రం ‘మగధీర’తో అప్పటి వరకు ఉన్న టాలీవుడ్ రికార్డులు బ్రేక్ చేశాడు. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నాడు రాంచరణ్.  రంగస్థలం చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో సినీ అభిమానులంతా రంగస్థలం చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు
ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రాంచరణ్ మునుపెన్నడూ కనిపించని గెటప్ లో దర్శనం ఇవ్వడంతో చరణ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రాంచరణ్ రంగస్థలం చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో చరణ్ ఎలా నటించాడనే ఆసక్తి అందరిలో ఉత్కంఠ రేపుతోంది.రంగస్థలం చిత్రంలో సమంత కూడా ప్రధాన ఆకర్షణ. సమంత పాత్రకు కూడా మంచి నటనకు ప్రాధాన్యత ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 
రామలక్ష్మిగా సమంత
1985 నాటి లోకల్ రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది.రంగస్థలం చిత్రానికి మరో ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పటికే అభిమానులని ఈ చిత్ర పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. చంద్రబోస్ సాహిత్యం అందించిన ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక మెగా పవర్‌స్టార్‌ రాంచరణ్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు మధ్య దూరం పెరిగిందనీ, అందుకే చెర్రీ కొత్త సినిమా రంగస్థలంపై కామెంట్‌ చేయడం లేదని సోషల్‌మీడియాలో బన్నీపై రూమర్స్‌ వచ్చాయి. పైగా సుకుమార్‌, అల్లు అర్జున్‌లు కూడా స్నేహితులే. అయినా కనీసం ఒక్క ట్వీట్‌ కూడా చేయడం లేదేంటని మెగా అభిమానులు తెగ ఆవేదన చెందారు.
Image result for rangasthalam stills
అయితే మెగా ఫ్యామిలీ లో ఎప్పుడూ విభేదాలు లేవని..మేమంతా కలిసే ఉన్నామని అల్లు అర్జున్ ఒక్క ట్విట్ తో చెప్పేశాడు.  తాజాగా అయాన్‌ని తల్లిదండ్రులు అల్లు అర్జున్, స్నేహ ఓ గళ్ల లుంగీ కట్టి.. రంగు బనియన్ దానిపై కలర్ ఫుల్ షర్ట్ వేసి.. మెడలో టవల్ వేసి అచ్చం చిట్టిబాబులా అలంకరించారు.

దీంతో అయాన్.. చిట్టిబాబులా ఫోజ్ ఇచ్చేశాడు. ఈ ఫోజుని తన కెమెరాలో బంధించిన బన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన మెగా అభిమానులు తెగ మురిసిపోతున్నారు. అల్లు అర్జున్ తనయుడు అయాన్ చిన్న వయసులోనే సినిమాలకు పెద్ద అభిమానిగా మారుతున్నాడేమో. రంగస్థలం చిత్ర ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. రాంచరణ్ చిట్టిబాబు గెటప్ లో ఉన్న అయాన్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


 



మరింత సమాచారం తెలుసుకోండి: