టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు’ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.  రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొరటాల శివ ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారారు.  ఈ సినిమాతో ప్రభాస్ కే కాదు దర్శకుడిగా కొరటాల కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ లాంటి మెస్సేజ్ ఓరియెంటెండ్ సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. 

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ లాంటి సామాజిక సృహా,పర్యావరణానికి సంబంధించిన సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు.  ఇలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ లీస్ట్ లోకి చేరిన కొరటాల శివ దర్శకత్వంలో స్టార్ హీరోలు నటించేందుకు ఉత్సాహ పడుతున్నారు.  ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ‘భరత్ అనే నేను’ రాజకీయ నేపథ్యంలో రూపొందింది. 
Image result for bharath ane nanu
ఈ సినిమా టీజర్ చూస్తుంటే..ఒక సామాన్య యువకుడు ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగాడు...తర్వాత ప్రజల కోసం ఏం చేశాడు అనేదే సినిమా సారాంశం. అయితే ఈ  సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి కథ అందించిన శ్రీహరి నాను.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాసినట్లు చెప్పారు. 2014లో పవన్ ‘జనసేన’ పార్టీ ప్రారంభించిన తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిదందన్నారు.
Image result for bharath ane nanu
ఆయనను దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాశానన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్‌‌ను కలిసి స్టోరీలైన్ వినిపించానని తెలిపారు. అయితే, తాను పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ సబ్జెక్ట్‌ను ప్రజలు తప్పుగా భావించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారన్నారు.  పార్టీ పెట్టి తాను సీఎం కావాలన్న ఉద్దేశంతో రాలేదని..ప్రజలకు తన చేతనైనంత సహాయం చేయడానికి వచ్చానని అన్నారు.

ఈ కథ రాశానన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్‌‌ను కలిసి స్టోరీలైన్ వినిపించానని తెలిపారు. అయితే, తాను పార్టీ పెట్టిన నేపథ్యంలో ఈ సబ్జెక్ట్‌ను ప్రజలు తప్పుగా భావించే అవకాశాలున్నాయని పవన్ తెలిపారన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: