జూనియర్ రామ్ చరణ్ లతో రాజమౌళి తీయబోతున్న భారీ మల్టీ స్టారర్ కు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చినా ఈవిషయం పై రాజమౌళి నుండి అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూసారు. నిన్న సాయంత్రం రాజమౌళి ఈ చిత్రాన్ని అఫీషియల్‌ గా అనౌన్స్ చేశాడు. అసలు ఎవరూ ఊహించని విధంగా వినూత్నంగా ఈ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్'  పేరుతో ఒక ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.
సంబంధిత చిత్రం
అయితే ఇది మూవీ టైటిల్ కాదని కేవలం ఈమూవీకి సంబంధించి వర్కింగ్ టైటిల్ అంటూ మరొక ట్విస్ట్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ లుక్ టీజర్ లోని ఒక ఆర్ రాజమౌళి అయితే మరొక ఆర్ రామ్ చరణ్ ఇక మూడవ ఆర్ రామారావు (జూనియర్ ఎన్టీఆర్). ఇప్పటి వరకు అభిమానులతో జూనియర్ గా పిలవబడుతున్న తారక్ ను అధికారికంగా రామారావుగా మార్చివేశాడు రాజమౌళి. 
RAJAMOULI LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలా ఈముగ్గురు పేర్లు కలిసేలా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈసినిమాకు సంబంధించిన విలన్ పాత్రలో ఒక బాలీవుడ్ నటుడు నటిస్తాడు అన్న వార్తలు వచ్చాయి. అయితే రాజమౌళి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం నెగిటివ్ పాత్రలో నటించడానికి తెలుగు నుండి మరో టాప్ యాక్టర్‌ను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. 
ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి
ప్రస్తుతానికి ఈ నెగిటివ్ పాత్ర పోషించే తెలుగు యాక్టర్ పేరు రాజమౌళి సస్పెన్స్ లో ఉంచుతున్నట్లు టాక్. మొదట్లో ఈసినిమాను వేగంగా పూర్తి చేద్దామని అనుకున్న రాజమౌళి తన ఆలోచనలు మార్చుకుని ఈమూవీ షూటింగ్ ను 250 రోజులు చేస్తున్న నేపధ్యంలో ఈమల్టీ స్టారర్ 2020 సమ్మర్ కు రిలీజ్ అయ్యేలా రాజమౌళి ప్రస్తుతం ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాప్ హీరో రేంజ్ కి జూనియర్ ఎదిగినా ఇంకా అతడి అభిమానులు ‘జూనియర్’ అంటూ పిలుస్తున్న నేపధ్యంలో ఇక అధికారికంగా జూనియర్ ను ‘రామారావు’ గా మార్చాడు రాజమౌళి..  



మరింత సమాచారం తెలుసుకోండి: