సుకుమార్ 1985 కాలాన్ని నేటి తరానికి పరిచయం చేయడానికి ‘రంగస్థలం’ మూవీ ద్వారా ప్రయత్నం చేస్తున్నాడు. తన ఆత్మ తన సొంత ఊరిలో ఉందని తన ఆత్మకోసం ‘రంగస్థలం’ తీసాను అని అంటున్నాడు సుకుమార్. 1985 కాలంనాటి వేషధారణ అప్పటి పరిస్థుతులు మనకు కళ్ళకు కట్టేలా చూపెడుతూ ప్రేక్షకులను ఆకాలంలోకి తీసుకు వెళ్ళిపోతాను అని ఈ దర్శకుడు చెపుతున్నాడు. 
RANGASTHALAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇలా అన్ని విషయాలలోను 1985 కాలంనాటి పరిస్తుతులను అనుసరిస్తున్న సుకుమార్ ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఆకాలంనాటి పద్ధతులను అనుసరించాలని చేసిన ప్రయత్నాలకు ఈమూవీ బయ్యర్ల దగ్గర నుండి ఎదురీత మొదలైంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీకి భారీ క్రేజ్ ఏర్పడిన నేపధ్యంలో ఈమూవీ విషయంలో ఏదైనా డివైడ్ టాక్ వస్తే ఈమూవీ ఫలితం పై విపరీతమైన ప్రభావాన్ని చూపెడుతుందని లోలోపల సుకుమార్ భయపడుతున్నట్లు టాక్. 
RANGASTHALAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనితో ఈసినిమాను టాప్ హీరోల రిలీజ్ స్ట్రాటజీకి భిన్నంగా తక్కువ ధియేటర్లలో విడుదల చేసి ఈమూవీకి పూర్తి పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత ధియేటర్ల సంఖ్య పెంచాలని మొదట్లో సుకుమార్ భావించినట్లు తెలుస్తోంది. అయితే ‘రంగస్థలం’ మూవీని అత్యంత భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లు సుకుమార్ ఆలోచనలను తిరస్కరించడమే కాకుండా ఎప్పటిలాగే టాప్ హీరోల సినిమాల సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అత్యధిక ధియేటర్ల లో విడుదలచేయమని ఈ మూవీ నిర్మాతల పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
RANGASTHALAM LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈసినిమా నిర్మాతలు స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అధికారిక అభ్యర్ధనలు కూడ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపొందింపబడ్డ ఈమూవీకి అనుకోకుండా డివైడ్ టాక్ వస్తే ఈమూవీని అత్యధిక ధియేటర్లలో విడుదల చేయడం శాపంగా మారుతుందా అని సుకుమార్ భయపడుతున్నట్లు టాక్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: