టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘కెరటం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా పెద్దగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత సందీప్ కిషన్ తో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో    రకూల్ ప్రీత్ సింగ్ కి ఒక్కసారే అదృష్టం కలిసి వచ్చింది.  మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
Image result for rakul preet singh
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలందరితో నటించే అవకాశాన్నిపొందింది. గతంలో రకూల్ తో సినిమాలు తీయడానికి యువహీరోలు పోటీలు పడ్డారంటే అశ్చర్యం లేదు.  ఏ హీరోతో అయినా కెమిస్ట్రీ బాగా వర్క్ ఔట్ అవుతుందనే ఉద్దేశ్యంతో రకూల్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  సినిమా జయాపజయాలతో పనిలేకుండా వరుస ఛాన్స్ లు దక్కించుకున్న రకూల్..తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారింది.
Related image
తాజాగా ఓ టీవి ఇంటర్వ్యూలో మాట్లాడిని రకూల్ తనను పెళ్లాడబోయేవాడు తనకంటే పొడగరి అయి ఉండాలని ప్రముఖ సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. టాలీవుడ్ లో అగ్రనాయకిగా ఉన్న రకుల్, కోలీవుడ్ లో పాగావేసే ప్రయత్నాల్లో ఉంది. తన ఎత్తు 5.9 అడుగులని, తనకు కాబోయేవాడు అంతకు మించిన ఎత్తుకలవాడై ఉండాలని చెప్పింది.
Image result for rakul preet singh gym
తాను నటిని కావాలకోలేదని చెప్పింది. పాకెట్‌ మనీ కోసమే నటించేందుకు కెమెరా ముందుకొచ్చానని చెప్పింది.  10 ఏళ్ల తరువాత వెనుదిరిగి చూసుకుంటే చేసిన ప్రతి సినిమా గుర్తుండిపోవాలని పేర్కొంది. అంతే కాదు సినిమాలు శాశ్వతం కాదన్న ఆలోచనతోనే విదేశీ నిపుణులతో కలిసి హైదరాబాద్‌ లో జిమ్‌ వ్యాపారం ప్రారంభించానని తెలిపింది. 

క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాధించానని చెబుతుంది. గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: