టాలీవుడ్ లో స్టార్ హీరోస్ తో జోడీ కట్టి మంచి స్వింగ్ లో ఉన్న బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకుంది. కానీ.. దాన్ని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతోంది. తన ఫ్యాన్స్ కి ఎప్పుడూ టచ్‌లో ఉండటానికి ఓ కొత్త ప్రయత్నం చేసింది. ‘రకుల్‌ ప్రీత్‌ సింగ్‌’ పేరిట ఓ యాప్‌ని రిలీజ్ చేసింది. ఇంతకీ సడన్ గా ఈ బ్యూటి ఇలా ట్రాక్ మార్చడానికి రీజన్ ఏంటి?

Image result for rakul preet singh

రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ టూ టాలీవుడ్ వయా కోలీవుడ్ కి ట్రావెల్ అయిన బ్యూటీ. మొన్నటి వరకు తెలుగులో వెలిగింది.. కానీ లాస్ట్ ఇయర్ నుంచి బ్యాడ్ టైం నడుస్తుండడంతో అరవ అడ్డాకి మకాం  మార్చేసింది. ప్రజెంట్ అక్కడ సూర్య, కార్తీలతో సినిమాలు చేస్తోంది. అదే సమయంలో తనను సూపర్ స్టార్ ను చేసిన తెలుగు ఆడియన్స్ కి దూరం అవ్వకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతోంది. ఇప్పుడు తనకంటూ స్పెషల్ గా ఓ సోషల్ మీడియా యాప్ ను రిలీజ్ చేసేసింది రకుల్.

Image result for rakul preet singh

రకుల్ ప్రీత్ అఫిషియల్ యాప్ అంటూ ప్రస్తుతానికి గూగుల్ ప్లే స్టోర్ లో ఆండ్రాయిడ్ యూజర్స్ కు అందుబాటులో ఉన్న ఈ యాప్ ద్వారా.. బోలెడన్ని ప్రత్యేకమైన సంగతులు చెబుతుందట. తనతో పాటు లైవ్ లో టచ్ లో ఉండేందుకు ఈ యాప్ ను ఫాలో అవండి అంటోంది రకుల్. ఈ యాప్ వ్యవహారం ఓకే కానీ.. ప్రస్తుతం ట్విట్టర్ అండ్ ఇన్ స్టాగ్రామ్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. ఇలాంటి రోజుల్లో అసలు యాప్ ఎందుకు? ట్విట్టర్.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ లలో చెప్పని కొత్త సంగతులు యాప్ ద్వారా ఏం చెబుతుంది? అంటూ కొత్త డౌట్స్ ని రైజ్ చేస్తున్నారు నెటిజన్స్.

Image result for rakul preet singh

ఇంతకీ సడన్ గా రకుల్ యాప్ రిలీజ్ చేయడానికి, ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటా.. అంటూ ఎనౌన్స్ చేయడానికి పెద్ద ప్లాన్ ఉందంటున్నారు సినీ పెద్దలు. ప్రజెంట్ తెలుగులో ఈ లేడీకి ఒక్క ఆఫర్ కూడా లేదు. ఏదో సూర్య, కార్తీ పుణ్యమా అని తమిళ్ లో రెండు  ప్రాజెక్ట్స్ ఎకౌంట్ లో పడ్డాయ్. వీటి తరువాత తన ఫ్యూచర్ ఏంటనేది డౌట్ గా మారబోతుంది. అందుకే యాప్ ద్వారా ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసి తెలుగులో మరిన్ని ఆఫర్స్ పట్టేయాలనే ప్లాన్ వేసింది అంటున్నారు. ఏజ్ బార్ స్టేజ్ లో కాజల్, నయనతార ఫాలో అవుతున్న లాజిక్ నే ఈ బ్యూటీ అప్లయ్ చేస్తోంది అంటున్నారు. మరి రకుల్ ఐడియా ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో... ఎన్ని ఆఫర్స్ తన ఎకౌంట్ లో పడతాయో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: