‘బాహుబలి’ తో నేషనల్ సెలిబ్రిటీగా మారిపోయిన ప్రభాస్ ప్రవర్తన ప్రస్తుతం డైరెక్టర్స్ కు టార్చర్ గా మారింది అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ప్రభాస్ క్రేజ్ ‘బాహుబలి’ కి ముందు ఒక పద్ధతిలో   ‘బాహుబలి2’ తర్వాత మరోపద్ధతిలో ఉండటంతో ఈవిషయాలను బ్యాలన్స్ చేసుకోవడంలో ప్రభాస్ వేస్తున్న తప్పటడుగులు అతడితో సినిమాలు తీస్తున్న దర్శకులకు టార్చర్ గా మారింది అనిఅంటున్నారు.       తెలుస్తున్న సమాచారం మేరకు ‘బాహుబలి’ తర్వాత పరిస్తుతులను  ప్రభాస్ సరిగ్గా అంచనా వేసుకోలేక పోవడంతో ‘సాహో’ ను మొదట తెలుగు స్క్రిప్ట్ గానే ప్రిపేర్ చేయించాడు అని టాక్. 
prabhas saho latest hotos కోసం చిత్ర ఫలితం
అయితే ‘బాహుబలి2’ తర్వాత ప్రభాస్ మార్కెట్ విపరీతంగా పెరిగి పోవడంతో తన మూవీ  ఇండియన్ ఆడియన్స్ మొత్తానికి నచ్చేలా ‘సాహో’ స్క్రిప్ట్ ను మార్చమని దర్శకుడు సుజిత్ కు చెప్పడంతో అసలు సమస్యలు మొదలు అయ్యాయి అని అంటున్నారు. దీనికి తోడు ఈ మూవీ షూటింగ్ సమయంలో తీస్తున్న ప్రతి సన్నివేస విషయంలో ప్రభాస్ మరీ ఎక్కువగా కల్పించుకోవడం దర్శకుడు సుజిత్  ఏకాగ్రతను పోగొడుతోంది అన్న వార్తలు కుడా వస్తున్నాయి. దీనితో 200 కోట్ల  ‘సాహో’ ప్రాజెక్ట్ ను సుజిత్ కు అప్పగించి తప్పు చేసానా అన్న అసహనం కూడ ప్రభాస్ కు రోజురోజుకి పెరిగిపోతోంది అని అంటున్నారు. 
prabhas saho latest hotos కోసం చిత్ర ఫలితం
‘సాహో’ నిర్మాణం ఆలస్యం అవుతున్న నేపధ్యంలో దర్శకుడు ‘జిల్’ రాధ కృష్ణ ప్రాజెక్ట్ ను ఇప్పుడు లైన్ లోకి పెట్టి ఈమూవీ అయినా కనీసం ఈ ఏడాది చివరి లోపుగా పూర్తి చేయాలి అన్నహడావిడిలో ప్రభాస్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తయారు అయిన ఈ స్క్రిప్ట్ విషయంలో కూడ అనేక మార్పులు చేర్పులు ప్రభాస్ చెపుతున్న పరిస్థితులలో దర్శకుడు రాధ కృష్ణ కుడా కన్ఫ్యూజ్ అవుతున్నాడని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
prabhas saho latest hotos కోసం చిత్ర ఫలితం
ఈ పరిస్తితుతులలో ప్రభాస్ ఈ మధ్య తన దగ్గరకు వస్తున్న దర్శకులను మల్టీ లాంగ్వేజ్ కి అనువుగా స్టోరీలు ప్రిపేర్ చేయమని కోరుతున్నాడట. ప్రభాస్ సినిమాను అన్ని భాషల్లోనూ  రిలీజ్ చేసుకునే ఛాన్స్ ఉన్న విషయం వాస్తవమే అయినా  ఒకే కధతో అన్ని భాషల ప్రేక్షకులను మెప్పించాలని ప్రభాస్ చేస్తున్న ప్రయత్నాలు అనుకోకుండా వికటిస్తే ప్రభాస్ ఇమేజ్ కి ఘోరమైన ఘోరమైన డ్యామేజ్ జరిగే అవకాసం ఉంది అన్న వాస్తవం ప్రభాస్ గుర్తిస్తే మంచిది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ప్రభాస్ కేవలం  నేషనల్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేయకుండా  బ్యాలెన్స్‌ చేయడం నేర్చుకుంటే ప్రభాస్‌కి మంచిది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘బాహుబలి’ తో ప్రభాస్ కు వచ్చిన నేషనల్ స్టార్ ఇమేజ్ ప్రభాస్ కు అనుకోని సమస్యలు తెచ్చి పెట్టేలా ఉంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: