టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ కోసం సర్వం సిద్ధమైంది. మార్చి 29న ఈ సినిమా గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. ఇక ఈ సినిమాలో  40 గెటప్పుల్లో సరికొత్తగా కనిపించబోతున్నాడు బాలయ్య. ఇంతవరకు ఓకే... కానీ బాలయ్య ఓ కన్నడ మూవీని రీమేక్ చేయబోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇప్పుడిదే టాలీవుడ్ లో హాట్ న్యూస్..!

Image result for balakrishna

టాలీవుడ్ లో ఎట్టకేలకు ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లబోతోంది. తేజ డైరెక్షన్‌లో బాలకృష్ణ నేతృత్వంలో ప్లాన్ చేసిన ‘ఎన్టీఆర్’కి బేస్ రెడీ అయ్యింది. కథనం, నటీనటుల ఎంపిక దాదాపు పూర్తికావడంతో ఈ ప్రాజెక్ట్‌ ని సెట్స్‌ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించాడు బాలయ్య. మార్చి 29న ఈ సినిమా పూజాకార్యక్రమాలు హైదరాబాద్‌లో జరగటానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఆ సినిమా యూనిట్.

Image result for balakrishna

ఇక ఈ బయోపిక్ పూజా కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బాలకృష్ణ ఇన్వైట్ చేసాడట. నేతలిద్దరూ తప్పకుండా వస్తామని మాట ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో కేసీఆర్ క్లాప్ కొడతారని, చంద్రబాబు స్విచ్ ఆన్ చేస్తారన్నది ఇన్‌సైడ్ టాక్. మొత్తానికి పూజా కార్యక్రమాలతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా ప్లాన్ చేశాడు బాలయ్య. ఈ కార్యక్రమం తర్వాత 2 వారాలు గ్యాప్‌ తీసుకుని లాంగ్ షెడ్యూల్‌ స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ తేజ. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చేఏడాది మార్చికల్లా NTR బయోపిక్ ని రిలీజ్ చేయాలన్నది ఆలోచన.

Image result for balakrishna

ఇలా బాలయ్య ఒక వైపు ఎన్టీఆర్ బయోపిక్ ని స్టార్ట్ చేస్తునే... మరో ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించాలనే ప్లాన్ లో ఉన్నాడట. కన్నడ లో బ్లాక్ బస్టార్ హిట్ గా నిలిచిన గ్యాంగ్ స్టర్ సినిమా 'ముఫ్టీ' ని తెలుగులో రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నాడట బాలయ్య. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా శివరాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో సినిమా కంటెంట్ పై బాలయ్య చూపు పడినట్లు టాక్. అండర్ కవర్ కాప్ - గ్యాంగ్ స్టర్ మధ్య టామ్ అండ్ జెర్రీ తరహాలో ముఫ్టీ కథ నడుస్తుంది. సినిమాలో స్క్రీన్ ప్లే మెయిన్ హైలెట్.

Image result for balakrishna

ఎన్టీఆర్ బయోపిక్ స్టార్ట్ అయిన తరువాత ఒకసారి స్పెషల్ షో వేసుకొని 'ముఫ్టీ' సినిమాని చూడాలని అనుకుంటున్నాడట బాలయ్య. కథ నచ్చితే ఆ సినిమాను కూడా వెంటనే స్టార్ట్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తానికి పైసా వసూల్ తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న బాలయ్య.. ఈ మంథ్ ఎండిగ్ నుంచి ఫుల్ బిజీ కాబోతున్నాడు. ఒకేసారి రెండు సినిమాలను తెరకెక్కించి వచ్చే సీజన్ లో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించబోతున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: