మరో ఆరు రోజులలో ‘రంగస్థలం’ విడుదలకు రంగం సిద్ధం అయిన నేపధ్యంలో ఈమూవీకి సంబంధించి ఒక కొత్త భయం రామ్ చరణ్ ను వెంటాడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చరణ్ మాస్ హీరోగా ఇప్పటికే మెగా అభిమానుల ప్రశంసలు పొందినా యాక్టర్ గా ఇంకా తనను తాను నిరూపించుకోలేకపోయాడు అన్న కామెంట్స్ ఉన్నాయి. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఈ కామెంట్స్ తోనే చరణ్ సుకుమార్ క్రియేట్ చేసిన ‘సౌండ్ ఇంజనీర్’ పాత్రలో చాల కష్టపడి నటించాడు అన్న వార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ ట్రైలర్ విడుదల అయిన తరువాత ఈమూవీ చరణ్ నటుడుగా మరో మెట్టు ఎక్కాడు అన్న ప్రశంసలు వస్తున్నా పల్లెటూరి నేపధ్యంలో 1985 కాలంనాటి ఈకథ నేటితరం యూత్ కు ముఖ్యంగా అర్బన్ యూత్ కు ఎంత వరకు కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. 
సంబంధిత చిత్రం
దీనికితోడు సుకుమార్ గతంలో తీసిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు ప్రశంసలు వచ్చినా కలక్షన్స్ పరంగా చెప్పుకోతగ్గ రికార్డులు క్రియేట్ చేయలేదు. ఇప్పుడు అదే పరిస్థితి ‘రంగస్థలం’ కు కూడ ఎదురౌతుందా అన్న సందేహాలు కొందరు వ్యక్తం చేస్తూ ఉండటం చరణ్ కు టార్చర్ గా మారింది అని టాక్. చరణ్ ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించినా ఇంకా యాభై కోట్ల నెట్ కలక్షన్స్ రేంజ్ లోనే ఉన్నాడు. 
RANGASTHALAM MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
‘రంగస్థలం’ తో చరణ్‌ 80 కోట్ల మార్కెట్‌ని టచ్‌ చేయాలి అన్న పట్టుదల పై ఉన్నాడు. ఈ కల నెరవేరకపోతే చరణ్ కు స్టార్స్‌ కోటాలో సెకండ్‌ లీగ్‌ హీరో అనే స్టాంప్‌ పడిపోతుంది అన్న భయం వెంటాడుతోంది అని అంటున్నారు. ఇప్పటికే మహేష్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌ అంతా 80 కోట్ల స్థాయిని అందుకున్నారు. ఇప్పుడు ఆ స్థాయిని చేరుకోవడంలో చరణ్ ‘రంగస్థలం’ ద్వారా విఫలం అయితే ఈమూవీ తరువాత ఇదే సమ్మర్ రేస్ కు విడుదలకాబోతున్న ‘భరత్ అనే నేను’ ‘నాపేరు సూర్య’ సినిమాలు ‘రంగస్థలం’ సినిమా కలక్షన్స్ రేంజ్ ని దాటిపోతే చరణ్ పడిన కష్టానికి ఫలితం ఏమిటి అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈకామెంట్స్ తో చరణ్ కు ‘రంగస్థలం’ అన్ని విధాల పరీక్షే అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: