అభిమానులు ఎన్నిసార్లు అడిగినా ప్రస్తుతానికి సినిమాలు చేసే ఆలోచనను విరమించుకున్న పవన్ కళ్యాణ్ మనసులో ఇప్పుడు ఒక లేటెస్ట్ వ్యూహం హల్ చల్ చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రత్యక్ష రాజకీయాలతో చాల బిజీగా ఉన్న పవన్ మరొక విధంగా ఇండస్ట్రీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. 
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే తన పవన్ కళ్యాణ్ ఆర్ట్స్ బ్యానర్ పై సినిమాలు తీయడం ప్రారంభించిన పవన్ త్వరలో తన సినిమాల నిర్మాణ వేగాన్ని మరింత పెంచి తన సినిమాల నిర్మాణం ద్వారా ఆదాయాన్ని పొందడానికి పదకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నితిన్ తో ‘చల్ మోహన్ రంగ’ సినిమాను పూర్తిచేసిన పవన్ తన తదుపరి సినిమాల నిర్మాణానికి సంబంధించిన కథలను వెతకమని పవన్ తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో చెప్పినట్లు తెలుస్తోంది.
PAVAN KALYAN LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అన్నీ కుదిరితే కొందరు టాప్ హీరోలతో సినిమాలు తీసే ఆలోచన కూడ పవన్ కు ఉన్నట్లు టాక్. ఇప్పటికే రామ్ చరణ్ తో తాను ఒక సినిమాను తీస్తాను అని గతంలో పవన్ ప్రకటించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే చరణ్ నిజంగా పవన్ బ్యానర్ లో సినిమా చేయాలి అనుకున్నా ప్రస్తుతం అతడు నటిస్తున్న బోయపాటి రాజమౌళిల సినిమాలు అయ్యేదాకా తన బాబాయికి సినిమాచేయలేని పరిస్థితిలో  చరణ్ ఉన్నాడు. అయితే ఇప్పటికే సినిమా నిర్మాతగా ఒక భారీ సక్సస్ ను అందుకున్న చరణ్ తన సలహాలను పవన్ కు ఇస్తూ నిర్మాతగా సక్సస్ కావడానికి తన వంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. 
సంబంధిత చిత్రం
చరణ్ అందించబోయే సహకారంతో పవన్ ఈ ఎన్నికల రణరంగం పూర్తి అయ్యే వరకు కొన్ని సినిమాలు తీసి నిర్మాతగా లాభ పదాలని ఆలోచిస్తున్నట్లు టాక్. వాస్తవానికి చరణ్ డేట్స్ అందుబాటులో లేకపోయినా ఎవరో ఒక మెగా యంగ్ హీరోతో పవన్ నిర్మాతగా సినిమా తీసే పరిస్థుతులు ఉన్నాయి అని అంటున్నారు. మెగా యంగ్ హీరోల మార్కెట్ కు ముఖ్యంగా చరణ్ భవిష్యత్ కు పరీక్షగా ‘రంగస్థలం’ రిజల్ట్ ఉండబోతున్న నేపధ్యంలో ఈ మూవీ విడుదల తరువాత పవన్ యాక్షన్ ప్లాన్ లో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: