ఆ మూవీ రిలీజ్ 2014లో. కాని షూటింగ్ స్టార్ట్ అయింది 2012లో. ఇంతా లాంగ్ డేట్‌ను, అలాగే లాంగ్ షెడ్యూల్‌ను పెట్టుకున్న ద‌ర్శకుడు ఎవ‌ర‌నా మీ డౌట్‌. తనే శంక‌ర్‌. శంక‌ర్ ఏ మూవీ తీసినా క‌లెక్షన్ల మోతే. ఇది 90 శాతం క‌రెక్ట్ అని, ఎవ‌రైన క‌ళ్ళు మూసుకొని చెప్పే మాట‌. అంతటి ప్రతిభాశైలి తీస్తున్న అప్‌క‌మింగ్ మూవీ ఐ. ఐ చిత్రం కోసం శంక‌ర్ దాదాపుగా ప్రపంచ‌దేశాలు అన్నింటిని చుట్టివ‌చ్చాడు. ఒక‌ప్పుడు జీన్స్ మూవీలో ఓ పాట కోసం ప్రపంచవింత‌ల‌ను షూట్ చేసిన ఘ‌న‌త శంక‌ర్‌. అలాగే ఇప్పుడు ఐ చిత్రం కోసం మ‌ళ్ళీ అటువంటిదే చేస్తున్నాడు.

ఐ చిత్రాన్ని దాదాపు 17 భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నాడు. ర‌జనీకాంత్ రోబో మూవీను 9 భాష‌ల్లో రిలీజ్ చేసిన అన్ని చోట్లా క‌లెక్షన్ల మోత మోగించాడు. ఇప్పుడు త‌న ద‌ర్శక‌త్వ ప్రతిభ‌ మొత్తాన్ని, ఐ మూవీలో జోడించాడు. ఇందులో 72 నిముషాల క్లైమాక్స్ యాక్షన్ పార్ట్ ఉంటుంద‌ట‌. ఇందులో దాదాపుగా సగం షూటింగ్‌ను ఫినిష్ చేసుకున్నాడు. మొత్తాంగా ఐ మూవి 80 శాతం పూర్తి చేసుకుంటే, ఈ 72 నిముషాల‌ యాక్షన్ పార్ట్ కోసం 13 నెల‌ల గ్రాఫిక్ వ‌ర్క్స్ షెడ్యూల్‌ను అడిగారంట విజువ‌ల్ ఎఫెక్ట్స్ కంపెనీ.

క్లైమాక్స్ సంబంధించిన గ్రాఫిక్స్ కొంత ఫారిన్‌లో జ‌రుగుతుంటే, కొంత బోంబే వి.ఎఫ్‌.ఎక్స్‌లో జ‌రుగుతుంది. మొత్తంగా శంక‌ర్ ఐ మూవీ 19 భాష‌ల్లో నిర్మిత‌మ‌వుతుంటే ఈ మూవీ రిలీజ్‌పై అభిమానులు పిచ్చ క్రేజ్‌ను పెంచుకుంటున్నారు. అప‌రిచితుడు త‌రువాత విక్రమ్‌,శంక‌ర్ కాంబినేష‌న్ ఈ మూవీతో మ‌రోసారి రిపీట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: