ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వచ్చిన అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తన అభినయంతో అందరిని సర్ ప్రైజ్ చేసిన ఈ అమ్మడు అర కొర అవకాశాలతో కెరియర్ కొనసాగిస్తుంది. తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో సరిగా అవకాశాలు రావు అన్న టాక్ ఉంది.


అయితే ఈషా మాత్రం అందుకు భిన్నంగా తన దగ్గరకు వచ్చిన ఆఫర్లలో తెలివిగా సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే ఎంత అభినయం చూపినా మిగతా వారిలా కెరియర్ స్ట్రాంగ్ అవ్వాలంటే హాట్ అప్పీల్ ఇవ్వాల్సిందే. అందుకే తనలోని హాట్ యనగిల్ చూపించేలా ఓ క్రేజీ ఫోటో షూట్ చేసింది. మనోజ్ కుమార్ ఫోటోగ్రఫీలో ఓ స్పైసీ ఫోటో షూట్ చేసింది అమ్మడు.


ఇందులో అమ్మడి గ్లామర్ షో తాను కూడా స్కిన్ షోకి సిద్ధమే అంటూ హింట్ ఇచ్చినట్టు ఉంది. చూపులతో గిలిగింతలు పెడుతున్న ఈ అమ్మడు సరైన అవకాశం వస్తే చాలు తానేంటో చూపిస్తా అన్నట్టు ఉంది. ఫోటో షూట్ చూసిన వారు ఈషాలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 


ఈమధ్యనే అ! సినిమాతో అలరించిన ఈషా రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగు అమ్మాయిలకు స్టార్ హీరోలు అవకాశం ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే ఈషా మాత్రం తనకు వచ్చిన అవకాశాలను చేస్తూ వెళ్తుంది. మరి ఈ ఫోటో షూట్ పుణ్యమాని ఏదైనా క్రేజీ ఆఫర్ ఆమె సొంతం అవుతుందేమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: