బాలీవుడ్ కండల వీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాయ్ సల్మాన్ ఖాన్ ఎందరో సుందరీమణులను హిందీ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కత్రినా కైఫ్, సొనాక్షి సిన్హా, జాక్వలైన్ ఫెర్నాండేజ్ తదితరులంతా సల్మాన్ చేతి మీదుగా ఇంట్రడ్యూస్ అయి స్టార్ స్టేటస్ అందుకున్న నటీమణులే.  బాలీవుడ్ టాప్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రస్తుతం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా వుంది.
Image result for జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రేస్ 3
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆరు సినిమాల్లో జాక్వెలిన్ నటిస్తోంది. ఈ మద్య ఓ సినిమా మ్యాగజైన్ కోసం జాక్వెలిన్ హాట్ ఫోటోలు రిలీజ్ కావడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీలంక నుండి వచ్చి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తనదైన నటనా శైలితో కుర్రకారు మతి పోగొడుతున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్.  ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రేస్ 3' సినిమాలో నటించింది.
Image result for జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రేస్ 3
తాజాగా సల్మాన్ ... సిల్వెస్ట్ స్టోలెన్ వీడియో పోస్టు చేస్తూ 'ఈ వారం మీకు 'రేస్ 3' ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నాను' అని సల్మాన్ ట్వీట్ చేయడంతో ఈ చిత్రంలో సిల్వెస్టర్ స్టోలెన్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.  రేస్ 3 చిత్రంలో సల్మాన్ ఖాన్, బాడీ డియోల్, అనిల్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, డైసా షా తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
Image result for జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రేస్ 3
తాజాగా నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ షూటింగ్ లో గాయపడింది.  ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'రేస్ 3' చిత్రం అబుదాబీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ లో భాగంగా స్క్వాష్ గేమ్ ఆడుతున్న టైంలో బాల్ జాక్వెలైన్ ఎడమ కంటి పై భాగంలో తగలింది.
Image result for జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రేస్ 3
వెంటనే ఆమెని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. నిర్మాత రమేష్ తౌరానీ మాట్లాడుతూ, జాక్వెలిన్ కు అయిన గాయం చిన్నదేనని చెప్పారు. ప్రస్తుతం ఆమె బాగానే ఉందని... త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటుందని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: