ఈ మద్య కొన్ని టీవి, యూట్యూబ్ ఛానల్స్ లో వస్తున్న ఇంటర్వ్యూలో పెను వివాదాలకు దారి తీస్తుంది.  కాన్సెప్ట్ ఏదైనా దాన్ని కాస్త కాంట్రవర్సీగా చూపిస్తూ..ప్రేక్షకులకు క్యూరియాసిటీ పెంచుతున్నారు. ఇక తమ ఛానల్ రేటింగ్ కోసం కొంత మంది ఇంటర్వ్యూలో బూతు మాటలు మాట్లాడితే..వాటిని హైటెల్ చేస్తూ చూపించడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ పెదవి విరుస్తుంది.  తాజాగా నటీమణులపై కొంత మంది ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తుండటంపై టాలీవుడ్ మండిపడింది.
Image result for ap special status
ఓ తెలుగు టీవీ ఛానెల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు న్యూస్ ఛానెల్‌లో ఓ డిబెట్ సందర్భంగా టాలీవుడ్ మహిళలను ఉద్దేశించి యాంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ కంప్లైంట్ చేసింది.  ఇప్పటి వరకు చూస్తూ ఉరుకున్నా..ఆ ఛానెల్‌లో వస్తున్న ఇంటర్వ్యూలో కాస్త అదుపు తప్పుతున్నాయని..ఇష్టానుసారంగా చూపిస్తూ...ప్రేక్షకులు, నటీనటుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Image result for posani krishna murali
ఫిర్యాదు చేసినవారిలో శివాజీ రాజా, ఉత్తేజ్, బెనర్జీ, ఝాన్సీ తదితరులు ఉన్నారు. ప్రత్యేక హోదా, బీజేపీ-టీడీపీ నిందారోపణల నేపథ్యంలో ఏపీలో పరిణామాలపై సినీ రంగ ప్రముఖులు నోరు మెదపడం లేరంటూ వస్తున్న విమర్శలపై సదరు టీవీ ఛానెల్ ప్రత్యేక చర్చ నిర్వహించింది. పోసాని కృష్ణమురళి ఈ కార్యక్రమానికి హాజరై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: