ఫిదా హిట్ తో కెరియర్ లో తొలి కమర్షియల్ హిట్ మజా ఎంజాయ్ చేసిన వరుణ్ తేజ్ ఆ తర్వాత వచ్చిన తొలిప్రేమ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఘాజి డైరక్టర్ తో సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్న వరుణ్ తేజ్ వెంకటేష్ తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాకు సిద్ధమయ్యాడు.


సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో ఈ క్రేజీ స్టార్స్ కలిసి నటిస్తున్నారు. ఇక సినిమా టైటిల్ గా ఫన్ అండ్ ఫ్రెస్టేషన్ అన్నదే ఫైనల్ చేశారు. ఇక టైటిల్ లోగో చూస్తేనే ఈ సినిమా అంతా ఫన్నీగా ఉంటుందని చెప్పేయొచ్చు. పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాలతో హ్యాట్రిక్ అందుకున్న అనీల్ రావిపుడి ఈ మెగా మల్టీస్టారర్ తో కూడా హిట్ కొట్టడం గ్యారెంటీ అని చెబుతున్నారు.


దిల్ రాజు బ్యానర్ లో రాబోతున్న ఈ సినిమా టైటిల్ లోగో ఇంప్రెస్ చేసింది. ప్రస్తుతం వెంకటేష్ తేజ డైరక్షన్ లో ఆటా నాదే వేటా నాదే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగనఏ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడని తెలుస్తుంది. మరి ఈ ఫన్ అండ్ ఫ్రెస్టేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.


మాస్ అండ్ కమర్షియల్ సినిమాలను ఆడియెన్స్ మెచ్చే సినిమాగా మలచడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్న అనీల్ సినిమా అంటే సేఫ్ అన్న టాక్ వచ్చింది. మరి ఈ మల్టీస్టారర్ విషయంలో కూడా అది ప్రూవ్ చేసుకుంటాడా లేదా అన్నది చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: