నితిన్ హీరోగా కృష్ణ చైతన్య హీరోగా వస్తున్న సినిమా ఛల్ మోహన్ రంగ. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో పవన్ ఓ నిర్మాతగా రాబోతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. నిన్న ఆడియో రిలీజ్ సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక పవన్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.


త్రివిక్రం కథ అందించిన ఈ సినిమాకు కృష్ణ చైతన్య రచన కలిసి వచ్చినట్టు తెలుస్తుంది. నితిన్ కు జోడిగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తుంది. లై సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించారు. మరోసారి ఈ జంట ఓ క్రేజీ లవ్ స్టోరీతో రాబోతుంది. ట్రైలర్ లో ఇద్దరు లవ్ అండ్ ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయ్యింది.


ఇక కామెడీ కూడా బాగానే వర్క్ అవుట్ అయినట్టు తెలుస్తుంది. ఏప్రిల్ 5న రాబోతున్న ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా చెప్పేశారు. ఇక సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. ఛల్ మోహన్ రంగ సినిమా నితిన్ కెరియర్ లో క్రేజీ మూవీగా రాబోతుంది.


అఆ సినిమాతో హిట్ అందుకున్నా లైతో నిరాశ పరచిన నితిన్ ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టబోతున్నాడని అంటున్నారు. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉండగా అంచనాలను అందుకుంటే మాత్రం ఈ సినిమా నితిన్ కెరియర్ లో బెస్ట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: