టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద చర్చే జరుగుతోంది. సినిమా ఇండస్ట్రీలో కమిట్ మెంట్ లేకుండా ఛాన్సెస్ దక్కడం కష్టమంటూ పలువురు తారలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. తాజాగా నటి శ్రీరెడ్డి చెప్పిన కొన్ని మాటలు ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. తనను వాడుకుని వదిలేసిన పలువురి బాగోతాలు బయటపెడతానంటూ శ్రీరెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్. అందుకు తగ్గట్లే ఇప్పుడు శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో ఓ ఫోటో బయటపెట్టింది.

Image result for sri reddy

          టాలీవుడ్ లో అవకాశం రావాలంటే తప్పనిసరిగా కమిట్ మెంట్ ఇవ్వాల్సిందేనని పలువురు తారలు ఇటీవల మీడియా ముందుకొచ్చి చెప్పారు. తెలుగులో ఎంతో మంది అందగత్తెలున్నా ఇక్కడివారికి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను దిగుమతి చేసుకోవడానికి ఇదే కారణమనేది వీరి ఆరోపణ. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కమిట్ మెంట్స్ కు సిద్ధంగా ఉంటున్నారని, అందుకే తెలుగు తారలకు అవకాశాలు రావట్లేదని చెప్పుకొస్తున్నారు. శ్రీరెడ్డి, గాయత్రి, మాధవిలత.. ఇలా ఎంతోమంది ఈ కామెంట్స్ చేశారు.


          నటి శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఉద్యమమే స్టార్ట్ చేసింది. తనను వాడుకుని వదిలేసిన అందరి బాగోతాలను త్వరలోనే బయటపెడతానని ఇటీవల మీడియాలో ఓపెన్ గానే చెప్పేసింది. ఈ జాబితాలో పలువురు బడా నిర్మాతలు, వారి కొడుకులు, ప్రముఖ దర్శకులు కూడా ఉన్నట్టు శ్రీరెడ్డి చెప్పారు. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన శ్రీరెడ్డి ఇప్పుడు ఆధారాలు బయటపెట్టేందుకు ముందుకొచ్చింది. తాజాగా ఫేస్ బుక్ లో ఓ ఫోటో పెట్టింది. ‘లీక్స్ స్టార్టెడ్” అంటూ ఓ యువకుడు తనను కిస్ చేయబోతున్నట్టుగా ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేసింది.

Image result for sri reddy

          శ్రీరెడ్డి లిస్ట్ లో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్టు ఆమె చెప్పే మాటలను బట్టి తెలుస్తోంది. క్యాస్టింగ్ కౌచ్ నుంచి ఇండస్ట్రీని కాపాడాలని ఆమె తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అప్పటిదాకా తన పోరాటం కొనసాగుతుందని, తనతో మరింత మంది కలిసి వస్తారని చెప్పుకొచ్చారు. మరి ఇవాళ ప్రారంభమైన ఈ లీక్స్ ఎంతవరకూ వెళ్తాయో చూడాలి మరి..


మరింత సమాచారం తెలుసుకోండి: