తెలుగు జాతి గర్వించే విధంగా తన నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించిన విశ్వవిఖ్యాత నటసౌర్వభౌములు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) కేవలం నటనకు మాత్రమే పరిమతం కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన ప్రతిభ నిరూపించాడు. 

తెలుగు దేశం పార్టీ స్థాపించి తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢీల్లీ వరకు చాటి చెప్పారు.  ప్రస్తుతం ఆయన వారసులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్లో ఉన్నారు. ఈ మద్య సినీ, రాజకీయాల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చకున్న వారి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నాగ్ అశ్విన్ అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆదారంగా ‘మహానటి’ సినిమా తీస్తున్నారు. 
Image result for ntr biopic
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీయడానికి సిద్దమైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  ఆ మద్య ఎన్టీఆర్ బయోపిక్ పై రక రకాల రూమర్లు పుట్టుకొచ్చాయి.  వాటన్నింటికి ఖండిస్తూ..డైరెక్టర్ తేజ తాజాగా ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త చెప్పారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఎన్టీఆర్‌పై తీయనున్న బయోపిక్‌కు ముహుర్తం తేదీని వెల్లడించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కబోయే ఈ సినిమాను గురువారం (మార్చి 29) ప్రారంభించనున్నట్లు తెలిపారు.
Related image
గతంలో నందమూరి బాలకృష్ణ చెప్పినట్లు మార్చి 29 ఈ సినిమా ముహూర్తం మొదలు పెట్టి సంక్రాంతి కానుకగా అందించనున్నట్లు తెలిపారు.  ఈ నేపథ్యంలో రామకృష్ణ స్టూడియోస్‌లో ఆ రోజు ఉదయం 9.30 గంటలకు ఈ ప్రారంభోత్సవ వేడుకను నిర్వహించనున్నట్టు డైరెక్టర్ తేజ.. ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ప్రారంభోత్సవ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను కూడా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వీరితో పాటు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: