ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ పైనే చర్చించుకుంటున్నారు.  గతంలో కొంత మంది హీరోయిన్లు తాము ఇండస్ట్రీలోకి రావాలంటే..కొంత మంది బడా బాబులు పక్కలో పడుకుంటేనే చాన్స్ లు ఇస్తామని..అలా ఇచ్చిన వారికే ఇక్కడ చాన్స్ ఉంటుందని ఆరోపణలు చేశారు.  తాజాగా సినీనటి శ్రీ రెడ్డి కొంత కాలంగా పలు ఛానల్స్ లో తెలుగు అమ్మాయిలకు ఇండస్ట్రీలో చాన్స్ లు రావడం లేదని..ఒకవేళ సినిమా చాన్స్ లు రావాలంటే...పడక సుఖం ఇవ్వాల్సిందే అనడంతో టాపిక్ వేడెక్కింది.

తాజాగా  కాస్టింగ్ కౌచ్ పై పలువురు నటీమణులు మీడియాకెక్కి రచ్చ చేయడంపై నటి కరాటే కళ్యాణి స్పందించారు. కమిట్మెంటు ఇస్తేనే అవకాశాలు అనే ఆరోపణలపై ఆమె మాట్లాడుతూ.... టాలెంట్ ఉంటేనే ఎవరైనా అవకాశాలు ఇస్తారు, నా కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్లు రాస్తున్నారంటే..ఈమెలో టాలెంట్ ఉంది, డైలాగ్ డెలివరీ బాగా ఉంటుంది అని వారు నమ్మారు కాబట్టే అని కళ్యాణి తెలిపారు. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలంటే..పడక సుఖం ఇవ్వాలని అడిగితే..వెంటనే ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకు రావాలి..లేదా నేను రాను, నాకు ఇష్టం లేదు, నేను ఆ టైపు కాదు అని చెబితే నిన్ను ఎందుకు అడుగుతారు? అని ప్రశ్నించింది. నీ పబ్లిసిటీ కోసం ఇంకొకరి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కరెక్ట్ కాదు అని కళ్యాణి అన్నారు.
Image result for sri reddy hot
ఇండస్ట్రీలో బ్రతుకుతూ, ఇండస్ట్రీ తిండి తింటూ, నిన్ను తల్లిలా ఆదరిస్తున్న ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం సరికాదు. ఒక విధంగా ఇది సహించరాని నేరం. ఇండస్ట్రీ గురించి తప్పుగా మాట్లాడే వారు నాకు ఎదురు పడితే..వారి తాట తీస్తానని అన్నారు. మనం ప్రవర్తించే తీరు బట్టే ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. నన్నెందుకు వచ్చి అడగరు? నిన్నే ఎందుకు అడుగుతున్నారు? నీ బిహేవియర్, నీ పర్సనాలిటీ, పద్దతులు, నీ మాటలు బట్టే అవన్నీ ఉంటాయి. 
Image result for sri reddy hot
సినిమాల్లో మనం చేసే క్యారెక్టర్లను బట్టి ఎవరూ మనల్ని డిసైడ్ చేయరు, మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. నీ పట్ల ఏదో జరిగిందని మిగతా అందరూ అలాగే అనుకుంటే పొరపాటు అని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: