తెలుగు ఇండస్ట్రీలోకి జయం చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో నితిన్ ఆ తర్వాత దిల్ రాజు తెరకెక్కించిన ‘దిల్’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.  ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ మనోడికి పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. కానీ హీరోగా ఎక్కడా ఏ డ్యామేజ్ లేకుండా సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ అవుతూ వచ్చాడు నితిన్.  ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అ..ఆ సినిమాలు కాస్త బూస్టింగ్ ఇచ్చాయి.  తాజాగా నితిన్ హీరోగా, మేగా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ‘చల్ మోహన్ రంగ’ చిత్రం వచ్చే నెల 5న రిలీజ్ చేయబోతున్నారు.

Image result for chal mohan ranga

ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ముఖ్య అతిధిగా విచ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది.  ‘చల్ మోహనరంగ’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కనిపించబోతున్నాడట. అదే ఈ చిత్రానికి హైలెట్ కాబోతుందని టాలీవుడ్ సెంటర్ లో టాక్ వినిపిస్తుంది. 

Image result for pawan nitin

ఇదే గనక జరిగితే..సినిమాకి మంచి క్రేజ్ వస్తుందని అంటున్నారు. అంతే కాదు అజ్ఞాతవాసి తర్వాత పవన్ ని వెండితెరపై చూసే భాగ్యం కలుగుతుందని పవన్ అభిమానులు తెగ ఉత్సాహ పడుతున్నారు. ఇక తాజా ఇంటర్వ్యూలో నితిన్ దగ్గర ఈ విషయాన్ని గురించిన ప్రస్తావన వచ్చింది. పవన్ ఈ 'సినిమాలో ఉండడు .. కానీ వున్నట్లే ఉంటుంది' అంటూ నితిన్ సస్పెన్స్ లో పెట్టేశాడు.

Image result for pawan nitin

దాంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మొదటి నుంచి పవన్ కళ్యాన్ అంటే విపరీతమైన అభిమానం చూపించే నితిన్ తన సినిమాలో ఒక్క బిట్ అయినా పవన్ తో చేయించాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలో ఆ కల నెరవేరిందా లేదా అనేది సినిమా చూసే వరకు సస్పెన్స్ గానే ఉంటుంది. నితిన్ .. త్రివిక్రమ్ తో పాటు పవన్ కూడా ఈ సినిమాకి ఓ నిర్మాత అనే సంగతి తెలిసిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: