పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మెగా బ్రదర్ నాగబాబు పేల్చిన మాటల తూటాలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. ఈ మధ్య  ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు తన అన్న చిరంజీవి గురించి మాట్లాడుతూ ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన 24 సంవత్సరాల యువకుడు, ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా కేవలం స్వయంకృషి తో మెగాస్టార్ గా ఎదిగిన ఘనత చిరంజీవి సొంతమని అంటూ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలలో ఓడిపోయినా18% ఓట్లతో తన స్థాయి ఏమిటో నిరూపించుకునీ ఒక జాతీయ పార్టీని ఆకర్షించడమే కాకుండా ఆ పార్టీ ఆహ్వానం మేరకు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపినా ఒక కీలక శక్తిగా ఇప్పటికీ చిరూ రాష్ట్ర రాజకీయాలలో కొనసాగుతున్నాడని అని అంటూ, ఇటువంటి స్థాయికి అందుకోగల నటుడు ఇప్పుడు ఎవరున్నారు అని అనడమే కాకుండా పవన్ కళ్యాణ్, రాంచరణ్, అల్లుఅర్జున్ లకే కాకుండా తనకూ తన పిల్లలకూ కూడా చిరంజీవి ఆనాడు ఈనాడు రేపుకుడా గాడ్ ఫాదర్ గానే ఉంటాడు అని అన్నాడు.  

చిరంజీవి లేకుండా తమ కుటుంబమే లేదు అంటూ తన అన్న పై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నాడు నాగబాబు. అంతేకాదు నేడు టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అంటూ, తమకో గుర్తింపు వచ్చిందీ అంటే అది చిరూ పుణ్యమే అన్నాడు ఈ మెగా బ్రదర్. పవన్, చరణ్, బన్నీ పదాలు భవిష్యత్ లో గుర్తుండవని చరిత్రలో మిగిలిపోయేది చిరంజీవి నామమంత్రమే అంటూ నాగబాబు అందుకున్న ఈ అన్న భజన చూస్తే కొద్దిరోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ పవన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ యిచ్చిన ట్విటర్ కు నాగబాబు సమాధానం అనుకోవాలి...

 

మరింత సమాచారం తెలుసుకోండి: