అక్కినేని అఖిల్ రెండు సినిమాలలో నటించినా కనీసపు హిట్ కూడ అందుకొని నేపధ్యంలో నాగార్జున అఖిల్ కెరియర్ పై తీవ్ర మధన పడుతున్నాడు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. దీనితో అఖిల్ నటించే మూడవ సినిమా అయినా హిట్ అవ్వాలని రకరకాల ఆలోచనలు చేసి చివరకు ‘తొలి ప్రేమ’ దర్శకుడు వెంకీ అట్లూరికి లైన్ క్లియర్ చేసిన విషయం తెలిసిందే. 
NITHIN ALONG WITH AKHIL LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
అయితే ఇప్పటికే ఈసినిమా కథ విషయం పై ఒక క్లారిటీ వచ్చినా ఈసినిమాకు సంబంధించి అఖిల్ తో నటించబోయే హీరోయిన్ ఎంపిక విషయమై ఏర్పడ్డ సమస్యలకు హీరో నితిన్ రాయబారంతో సమస్య పరిష్కారం అయింది అని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ తో వరసపెట్టి సినిమాలు చేస్తున్న యంగ్ హీరోయిన్ మేఘా ఆకాష్ ను అఖిల్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేయడం వెనుక నితిన్ రికమండేషన్ ఉంది అన్న వార్తలు వస్తున్నాయి.
HERO NITHIN IN CHAL MOHAN RANGA LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
ఇప్పటికే నితిన్ మేఘా ఆకాష్ తో సన్నిహితంగా ఉంటున్నాడు అన్న వార్తలను ఇప్పటికే నితిన్ ఖండించినా నితిన్ పట్టుపట్టి మరీ మేఘా ఆకాష్ కు అఖిల్ ప్రాజెక్ట్ లో అవకాసం కల్పించేలా చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇది ఇలా ఉండగా అఖిల్ ను ఎలాగైనా స్టార్ ను చేయాలని నాగార్జున అనేకమంది టాప్ డైరెక్టర్స్ తో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమి కలిసి రావడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 
AKHIL IN HELLO MOVIE LATEST PHOTOS కోసం చిత్ర ఫలితం
దీనికితోడు కెరియర్ స్టార్టింగ్ లో చిన్న సినిమాలకి పరిమితం అయిన నాగచైతన్య ఇంతవరకు నెక్స్‌ట్‌ లెవల్‌ కి వెళ్లలేకపోతున్నట్లుగానే అఖిల్ ఎంచుకుంటున్న సినిమాల కథలకు సంబంధించిన విషయాలతో పాటు లేటెస్ట్ గా రామ్ గోపాల్ వర్మతో అఖిల్ సినిమా చేయబోతున్నాడు అని వస్తున్న వార్తలను చూసి అఖిల్ ప్రయోగాలు ఊహజనితంగా ఉన్నాయని కొందరు సెటైర్లు వేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: