బాహుబలి.. ప్రభాస్ అను ఇంటర్నేషనల్ స్టార్ ను చేసిన సినిమా.. ఒకే సినిమాకు ఐదేళ్ల వరకూ సమయం కేటాయించిన ప్రభాస్ అందుకు తగ్గ ఫలితాన్నే అందుకున్నాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించడంతో వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఇటీవల పాకిస్తాన్ లో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ కు కూడా బాహుబలి టీమ్ కు స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది. 


Chiranjeevi's 'Sye Raa' gets a Big Bollywood connection

మరి ప్రభాస్ కు అంతగా పేరు వచ్చిందంటే అమరేంద్ర బాహుబలి పాత్రను జక్కన్న చెక్కిన విధానమే కారణం. ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజమౌళి చాలా కేర్ తీసుకుని ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అందుకే ఆ పాత్ర అంతగా జనం హృదయాల్లో నిలిచిపోయింది. ప్రభాస్ రాజసాన్ని అంతగా పండించగలిగాడంటే అందులో కాస్టూమ్స్, ఆయుధాల రూపకల్పన కీలక పాత్ర పోషించాయని చెప్పకతప్పదు.

Image result for chiranjeevi COPYING PRABHAS

అలాంటి బాహుబలి కాస్టూమ్స్ ను ఇప్పుడు మెగాస్టార్ కాపీ కొడుతున్నాడా.. అంటే అవుననే అనిపిస్తోంది. కాస్టూమ్స్ నే కాదు.. మొత్తం ప్రభాస్ లుక్కునే చిరంజీవి అనుకరిస్తున్నాడేమో అన్న టాక్ వచ్చేస్తోంది. ఇటీవల అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన సైరా స్టిల్ ను చూస్తే అచ్చం ప్రభాస్ ను చూసినట్టుగానే అనిపించింది. ఆ పిక్ వైరల్ కావడంతో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: