రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం బాక్సాఫీసు వద్ద కనీవినీ ఎరుగని కలెక్షన్లతో దూసుకెళుతోంది. ఈ చిత్రం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ చెవిటివాడిగా అద్భుతమైన నటన ప్రదర్శించాడు..ఒక రకంగా చెప్పాలంటే ‘రంగస్థలం’ చిత్రానికి ప్రాణం పోశాడని విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.
యూఎస్ఏలో 2 మిలియన్
1980ల నాటి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ ఇలా అన్నీ కలగలపి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతికి గురి చేస్తున్నాయి.  రిలీజ్ ముందు నుండే భారీ హైప్ ఉండటంతో 1500 థియేటర్లలో రంగస్థలం విడుదలైంది. సినిమాకు రెస్పాన్స్ అద్భుతంగా ఉండటంతో తొలి రోజే రూ. 43.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మౌత్ టాక్ అద్భుతంగా ఉండటంతో శని, ఆది వారాల్లో కూడా సినిమా కలెక్షన్లు అదిరిపోయాయి. 
70% రికవరీ
ఇక రాంచరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ‘ధృవ’ లైఫ్‌టైమ్‌లో రూ. 89.60 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.  కానీ ‘రంగస్థలం’ సోమవారం మొదటి ఆటకే అధిగమించడం ఖాయం. 4వ రోజుతో ఈ చిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని అంచనా. అంతే కాదు దీంతో డిస్ట్రిబ్యూటర్లకు మూడు రోజుల్లోనే 70% మేర పెట్టుబడి రికవరీ అయింది. బాక్సాఫీసు వద్ద తొలివారం పూర్తయ్యేలోపు డిస్ట్రబ్యూటర్ల ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా తిరిగి రావడంతో పాటు లాభాల్లోకి వెళతారని అంచనా.రంగస్థలం' చిత్రాన్ని దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గ్రాస్
 గ్లోబల్ థియేట్రికల్ రైట్స్ రూ. 80 కోట్లకు అమ్మినట్లు సమాచారం. 3 రోజుల్లో 88 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో షేర్ రూ. 56 కోట్లు వచ్చింది.తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో 38.89 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. నైజాంలో రూ. 10.88 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.60 కోట్లు, వైజాగ్ ఏరియాలో 5.18 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 3.48 కోట్లు, వెస్ట్ గోదావరి 2.72 కోట్లు, కృష్ణ రూ. 3 కోట్లు, గుంటూరు రూ. 4.63 కోట్లు, నెల్లూరు రూ. 1.40 కోట్లు వసూలైటన్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: