ఇటీవలే అమ్మమ్మతో కలిసి స్టెప్పులేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన ఆదా శర్మ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హాట్ పిక్స్ తో ఎప్పుడూ మత్తెక్కించే ఈ సుందరి మరో హాట్ పిక్ ను సోషల్ మీడియాలో పెట్టి మరోసారి కుర్రకారు మతి పోగొట్టింది.


ఆదా శర్మ .. పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అమాయకత్వపు అందాలతో అందరి మదినీ దోచింది ఆదా శర్మ. అయితే ఆ అమ్మాయికి టైం కలిసిరాలేదు. మంచి దర్శకులు, హీరోలు తగిలినా తన క్రేజ్ ను నిలబెట్టుకోలేకపోయిందీ పాలబుగ్గల సుందరి. సినిమాలు తగ్గినా ఫ్యాన్స్ కు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటుంది ఆదా శర్మ.


టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కూడా అడపాదడపా సినిమాలు చేసింది. అయినా నో యూజ్.. పెద్దగా కాలం కలసిరాలేదు. దీంతో చివరకు చిన్న చిన్న కేరక్టర్లకు కూడా ఓకే చెప్పింది. టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో అలా కొన్ని సినిమాల్లో తళుక్కున మెరిసి మాయమైంది. అలాంటి చిన్న కేరక్టర్లు కూడా గగనమైపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటికే పరిమితమైపోయింది.


అవకాశాలు రాకపోయినా పెద్దగా పట్టించుకోని ఆదా శర్మ.. బోల్డ్ కెరక్టర్స్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అందుకే తన అందాలను ఎప్పుడూ ఫ్యాన్స్ కు పంచుతూ ఉంటుంది. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టి వార్తల్లో ఉంటుంది ఆదా శర్మ. అలాంటి ఎన్నో అందాలకు నెలవు ఆదా శర్మ. తాజాగా బికినీతో ఓ మేగజైన్ కు ఫోజు ఇచ్చిందీ ముద్దుగుమ్మ. సినిమా ఆఫర్స్ లేకపోయినా ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం ఆదా అదరగొడుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: