నందమూరి బాలకృష్ణ మహా నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జీవితంపై బయోపిక్ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో జరిగింది. ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వేడుక జరిపారు.  ఈ సందర్భంగా కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. చిత్రంలో ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు పాత్ర కూడా ఉండబోతోందని తెలుస్తోంది. 

Image result for ఎన్టీఆర్ బయోపిక్ చంద్రబాబు

చంద్రబాబు పాత్రలో ఓ ప్రముఖ నటుడిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.  గత కొంత కాలంగా బాలకృష్ణ తో ఎంతో సన్నిహితంగా ఉంటూ వస్తున్న డాక్టర్ రాజశేఖర్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తుంది. 
దసరాకు రిలీజ్
ఈ పాత్ర చేయాలని బాలకృష్ణ అడగటం, వెంటనే రాజశేఖర్ కూడా ఒప్పుకోవడం కూడా జరిగిందట.రాజశేఖర్ పోషించే సిబిఎన్ పాత్ర పరిమితమైన పాత్ర అని, ఒకటి రెండు సీన్లలో మాత్రమే ఆయన కనిపిస్తారని అంటున్నారు.
చేయడానికి సిద్ధమే అని ప్రకటించిన రాజశేఖర్
ఇందుకు సంబంధించి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.రాజశేఖర్ నటించిన ‘గరుడ వేగ' చిత్రం ప్రమోషన్లలో బాలయ్య పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ బాలయ్య సినిమాలో చిన్న పాత్ర చేయడానికి అయినా సిద్ధమే అని అప్పట్లో ప్రకటించారు.
Image result for mahesh babu
అంతే కాదు ఈ చిత్రంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారు? అయితే ఆయన ఎవరి పాత్రలో కనిపించబోతున్నారు? అనేది తెలియాల్సి ఉంది.

Image result for hero rajashekar


మరింత సమాచారం తెలుసుకోండి: