భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చకున్న గొప్ప నటి శ్రీదేవి.  బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి చిన్నప్పుడే ఎన్నో అవార్డులు రివార్డులు కైవసం చేసుకుంది.  పదహారో ఏట హీరోయిన్ గా మారిన శ్రీదేవి తెలుగు లో సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్,శోభన్ బాబు, కృష్ణలతో నటించి తర్వాత వారి వారసులు నాగార్జున, వెంకటేష్ లతో కూడా నటించింది.  ఇలా తెలుగు లో రెండు తరాల హీరోలతో హీరోయిన్ గా నటించిన గొప్ప శ్రీదేవికే దక్కింది. 
Image result for sridevi sister
తెలుగు లో మంచి ఫామ్ ఉండగానే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అక్కడ కూడా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.  తర్వాత బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ ని వివాహం చేసుకున్న శ్రీదేవి ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత సినిమాలకు పులిస్టాప్ పెట్టింది.  ఆ తర్వాత ఇంగ్లీష్ వింగ్లీష్ తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. 
Image result for sridevi sister
గత నెల దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడే కన్నుమూసింది. ఇదిలా ఉంటే90వ దశకంలో ఓ మ్యాగజైన్ కవర్ పేజి పై ‘అవును... నేను శ్రీదేవి సోదరిని’ అంటూ హెడ్‌లైన్స్ రాగానే శ్రీదేవి ఫ్యాన్సంతా షాక్ కి గురయ్యారు. కవర్ పేజీ మీద ఒక మహిళ ఫొటో ఉంది. ఆమె ప్రభాదేవి  ఆమె... శ్రీదేవి నుంచి తప్పిపోయిన సోదరి అని విపరీతంగా ప్రచారం జరిగింది. 
Image result for sridevi anupam kher prabhadevi
శ్రీదేవికి  ఒక చెల్లెలు శ్రీలత అని అందరికీ తెలుసు మరి ప్రభాదేవి ఎవరబ్బా అని అందరూ ఆలోచనలో పడ్డారు.  అసలు విషయానికి వస్తే.. ఆ విధంగా ముద్రించిన ఫొటో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుమమ్‌ఖేర్‌ది. ఏప్రిల్‌ఫూల్‌ను ఉద్దేశించి ఆ మ్యాగజైన్ ఈ కవర్ పేజీని డిజైన్ చేసింది.
Image result for sridevi anupam kher prabhadevi
అభిమానులను షాక్‌కు గురిచేసిన ఈ మ్యాగజైన్ కాపీలు క్షణాల్లో లెక్కకుమించి అమ్ముడు పోయాయి.అనుపమ్ ఖేర్‌కు ప్రభాదేవి రూపమిచ్చిన ఘనత మేకప్ ఆర్టిస్ట్, స్టయిలిస్ట్ మిక్కీకే దక్కుతుంది. ఈ ఫొటోను గౌతమ్ రాజాధ్యక్ష్ తన కెమెరాలో బంధించారు. ఈ ఫొటోను చూసినవారెవరికీ అది అనుపమ్ ఖేర్ అనే అనుమానం ఏ ఒక్కిరీ రాలేదట. 


మరింత సమాచారం తెలుసుకోండి: