ముట్టుకుంటే మాసిపోతుందన్నట్లుగా ఉంటుంది లండన్ బ్యూటీ ఎమీ జాక్సన్. వెండితెరపై ఆమెను చూసి డిస్ట్రబ్ అయినోళ్లు లక్షల్లో ఉంటారు. ఎంతోమంది కలల రాణిగా నిలిచిన ఆమె.. తాజాగా ఒక షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది.

Image result for AMY JACKSON

సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటారో చెప్పలేం. ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లి ఎప్పుడు? అంటే.. అప్పుడేనా? అన్న ఎదురుప్రశ్నను వేసే నటీమణులు గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమీ జాక్సన్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. త్వరలోనే సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నానంటూ ఎమీ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 

Image result for AMY JACKSON

కెనడాలో పుట్టి పెరిగిన ఎమీ .. మదరాసు పట్టణం సినిమాతో కొలీవుడ్ లో అడుగు పెట్టింది. తరువాత కోలీవుడ్ టు బాలీవుడ్ వయా టాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించింది. అయితే తన కెరీర్ లో ఎక్కువ సినిమాలు చేసింది మాత్రం తమిళ్ లోనే. ప్రజంట్ ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అది కూడా శంకర్ తెరకెక్కించిన రోబో 2. కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని పరిస్థితి. అందుకే  రోబో2 తరువాత మరే భారతీయ సినిమాల్లో నటించకూడదని ఎమీ జాక్సన్ నిర్ణయించుకుందట. పనిలో పనిగా తన మకాంని మొరాకో కి షిప్ట్ చేసేస్తుందట.

Image result for AMY JACKSON

ఎలా చూసినా తక్కువ టైంలోనే అన్ని ఇండస్ట్రీలలో వర్క్ చేసి మంచి పేరుతెచ్చుకుంది ఎమీజాక్సన్. తమిళంలో వెలుగుతునే, బాలీవుడ్ లో ఆఫర్స్ పట్టేసింది. తెలుగులో మాత్రం ఒక్కటి అరా సినిమాలతో సరిపెట్టుకుంది. ప్రజెంట్ ఒక ఇంగ్లిషు సీరియల్ లో మాత్రమే నటిస్తున్న ఈ బ్యూటి త్వరలో దానికి టాటా చెప్పేయబోతుందట. వీలైతే నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కి పుల్ స్టాప్ పెట్టేయాలనే ప్లాన్ లో ఉందంటున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ సడన్ గా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడానికి అసలు కారణమేంటో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.!


మరింత సమాచారం తెలుసుకోండి: